జగిత్యాల : తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్ల ఖర్చు చేస్తామని టీఆర్‌ఎస్ నేతగా కేసీఆర్ గతంలో ధర్మపురిలో హామీ ఇచ్చారు. నేడు ఆయనే సీఎం కావడంతో భారీగా నిధులు కేటాయిస్తారని ప్రజలు, అధికారులు ఆశిస్తున్నారు. ఈ పుష్కరాల ఏర్పాట్లపై గోదావరి నది పరివాహక ప్రాంతం లో గల దేవాలయాల అధికారులు ఇప్పటికే ఓ ప్రణాళిక తయారు చేశారు.
2015లో గోదావరి పుష్కరాలు
2003, జూలై 30 నుంచి 12 రోజులపాటు గోదావరి పుష్కరా లు జరిగాయి. అప్పుడు జిల్లాలో మల్లాపూర్ మండలంలోని వాల్గొండ, ధర్మపురి, కాళేశ్వరం, మంథని, కోటిలింగాల ప్రాంతంలో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్‌లో ప్రధానంగా బాసర, గూడెం, మంచిర్యాల ప్రాంతాల్లో జరి గాయి. ఈ సారి 2015, జూలై 14 నుంచి 12 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పుష్కరాలు జరగనున్నాయి.
ఏర్పాట్లపై ప్రణాళికలు
గతంలో పుష్కరాల ఏర్పాట్లు హడావుడిగా నెల ముందు చేపట్టేవారు. కానీ ఈసారి ప్రభుత్వం ఏడాది ముందుగా అవసరమైన ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించడంతో దేవాదాయశాఖ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు ప్రణాళిక తయారీలో నిమగ్నమయ్యారు.
ధర్మపురిలో భారీ ఏర్పాట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురికి తాను స్వయంగా రావడంతోపాటు జాతీయస్థాయి నాయకులను కూడా తీసుక వస్తాన ని ప్రకటించడంతో ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నా రు. టీఆర్‌ఎస్‌లో కీలక వ్యక్తిగా ఎదిగిన ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సైతం నిధులు ఎక్కువగా తెస్తారనే భావనతో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పుష్కరాలకు ధర్మపురిని కేం ద్ర బిందువుగా మార్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రణాళిక తయారు చేసి సబ్ కలెక్టర్ శ్రీకేశ్ లట్కర్‌కు అందించారు. ఈ ప్రణాళికకు త్వరలో కలెక్టర్ సమక్షంలో జరిగే సమీక్ష సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశం ఉందని, ఒక్క ధర్మపురిలోనే రూ.100 కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
ప్రణాళికలోని ముఖ్యాంశాలు
* ధర్మపురి దేవాలయంలో శ్రాద్ధ మండపంతోపాటు కోనేరు(బ్రహ్మపుష్కరిణి) శుభ్రత, మరమ్మతులు, దేవాలయ ఆవరణలో కొత్త నిర్మాణాలు, పాతవాటిని తొలగించి కొత్తగా ఏర్పాటు చేయడం
* పుష్కరాల సందర్భంగా తాత్కాలికంగా చలువ పందిళ్లు, షామియానాల ఏర్పాటు
* నది దగ్గర 500 మంది ఒకేసారి కేశఖండన చేయించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు
* విద్యుత్ సౌకర్యాలు, క్లాక్ రూముల ఏర్పాటు
* దేవాలయం, ధర్మశాలలకు రంగులు వేయడం
* వివిధ రూట్ మ్యాపులు, హెచ్చరిక బోర్డులు, సూచనల ప్లకార్డుల ఏర్పాటు
* లడ్డు/పులిహోర ప్రసాద విక్రయకేంద్రాల ఏర్పాట్లు
* 32 గదుల్లో వీఐపీల సేవలకు అవసరమైన సిబ్బంది. ప్రచార ఏర్పాట్లు. దేవాలయ భద్రత, ప్రముఖుల భద్రతా ఏర్పాట్లు
* దర్శన సౌకర్యాలు(క్యూలైన్ల ఏర్పాట్లు)
* 12 రోజులపాటు నిరంతర అన్నదానానికి ఏర్పాట్లు
* నది ఒడ్డునున్న జిల్లాలోని ఇతర దేవాలయాల్లో ఏర్పాట్లు
* పుష్కర ఘాట్లు వెడల్పు చేయడం, అదనంగా నిర్మించడం
* నదిలో బారికేడ్ల నిర్మాణం.
* బాత్‌రూంలు, టాయిలెట్ల నిర్మాణాలు
* శానిటేషన్‌కు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం
* మంచినీటి సౌకర్యాలు కల్పించడం
* పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చింతమణి చెరువును సుందరంగా తీర్చిదిద్దడం
* వైద్య సౌకర్యాల కల్పనకు చర్యలు, గజ ఈత గాళ్లను ఎంపిక చేయడం
* వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా చర్యలు
* ధర్మపురి పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడం
* పోలీసు బందోబస్తుకు ప్రత్యేక బలగాల ఏర్పాటు
* మద్యనిషేధాన్ని కొనసాగించడం
* వచ్చే ఏడాది గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంటలకు క్రాప్ హాలీడే ప్రకటించేలా చర్యలు చేపట్టాలని ప్రణాళిక రూపకల్పన చేశారు.
పుష్కరాలకు ప్రణాళిక
Published Sat, Jul 26 2014 1:14 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement