కరీంనగర్‌జిల్లా జగిత్యాల పట్టణంలో ఎస్‌బీఐ ఏటీఎంలో బుధవారం అర్థరాత్రి దొంగతనానికి ప్రయత్నించారు. బైపాస్‌రోడ్డులో ఉన్న ఏటీఎంలోకి కిటికీ అద్దాలు పగులగొట్టి ప్రవేశించిన దుండగులు.. లాకర్ ఓపెన్ చేసేందుకు విఫలయత్నం చేశారు. గురువారం ఉదయం బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఏటీఎంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.