గోదావరిఖని: సీఐటీయూ అనుబంధ ఆలిండి యా వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసీడబ్ల్యూఎఫ్) జాతీయ మహాసభలు ఆదివారం ముగిశాయి. కోల్‌కత్తాలోని రాంచీలో ఈనెల 28న సమావే శాలు ప్రారంభమయ్యాయి. సింగరేణి నుంచి సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు హాజరయ్యారు. చట్టబద్ధత లేనిలేబర్‌కోడ్స్ అమలు చేయడాన్ని నిరసిస్తూ వచ్చేనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు నాయకులు వెల్లడించారు.
ఈ సందర్భంగా జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీవాత్సవ, ప్రధాన కార్యదర్శిగా డీడీ రామానందం, సింగరేణి నుంచి ఉపాధ్యక్షుడిగా తుమ్మల రాజారెడ్డి, కార్యదర్శులుగా మంద నరసింహారావు, అల్లి రాజేందర్, వర్కింగ్ కమిటీ సభ్యులుగా మెండె శ్రీనివాస్, మేదరి సారయ్య, విజయగిరి శ్రీనివాస్, కంపేటి రాజయ్య, కుంట ప్రవీణ్, వెంగళ శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు.
లెదర్ ఇండస్ట్రీ భూముల సర్వేకు ఆదేశాలు
రామగుండం: అంతర్గాం మండలం లింగాపూర్ గ్రా మ శివారులోని సర్వే నంబ రు 132లో లెదర్ ఇండస్ట్రీకి 2023 నవంబర్ 27న కేటా యించిన 25 ఎకరాల్లో సర్వేచేసి హద్దులు నిర్ణయించాల ని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివా రం రాత్రి కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రతిని ధులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు ప్రతినిధులు తెలిపారు.
తాగునీటికి తప్పిన తిప్పలు
మంథని: మున్సిపల్ పరిధిలో పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మించలేదు. దీంతో ఎత్తులోని ప్రాంతాలు, దిగువన ఉన్నచోట నీరు సన్నటిధారగా వస్తోంది. సరిపడా నీరు లభించక పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. గంగాపురి ప్రాంతంలో గతంలో మంచినీరు, ఇతర అవసరాలకు సరిపడా నీరు సరఫరా అయ్యేది. నీటి వృథాను అరికట్టేందుకు మిషన్ భగీరథ అధికారులు క్లోజింగ్ చేయడంతో కేవలం తాగునీటి అవసరాలకే పైపులైన్ ద్వారా నీరు అందిస్తున్నారు.
ఈ క్రమంలో నీటి సమస్య తీవ్రమైంది. ప్రత్యామ్నాయంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు. తాగునీటి సమస్యపై మిషన్ భగీరఽథ అధికారులు ఇటీవల పర్యవేక్షణ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం కొన్ని ప్రాంతాలు, సాయంత్రం మిగిలిన ఏరియాల్లో నీటిసరఫరా చేయడంతో పట్టణవాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
96 శాతం ఆస్తిపన్ను వసూలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఆస్తిపన్ను వసూలుపై ప్ర త్యేక శ్రద్ధ తీసుకుని 96.06 శాతం(మార్చి 29వ తేదీ నాటికి) వసూలు చేశామని జిల్లా పంచాయతీ అధికా రి(డీపీవో) వీరబుచ్చయ్య తెలిపారు. మొత్తం 266 పంచాయతీల నుంచి రూ.7,21,08,240 ఆస్తిపన్ను వసూలు కావా ల్సి ఉండగా 6,92,68,002(96.06శాతం) వ సూలైనట్లు వివరించారు. ముత్తారం(మంథని), కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో నూరు శా తం, అత్యల్పంగా కమాన్‌పూర్ మండలంలో 84.58 శాతం వసూలైనట్లు తెలిపారు.
ముత్తారం మండలంలో రూ.32,55,502 (100.18శాతం), కాల్వశ్రీరాంపూర్‌లో రూ.59,49,326, అంతర్గాంలో రూ.46,53,698, పెద్దపల్లిలో 1,09,12,225, ఎలిగేడులో రూ.21,07,097, పాలకుర్తిలో రూ.57,65,145, రామగిరిలో రూ.54,88,211, మంథని మండలంలో రూ. 36,36,400, సుల్తానాబాద్ మండలంలో రూ. 84,71,660, ధర్మారంలో రూ. 67,94,884, ఓదెల మండలంలో రూ. 65,18,662, జూలపల్లి మండలంలో రూ.22, 47,490, కమాన్‌పూర్ మండలంలో రూ.34,67,702 ఆస్తిపన్ను వసూలైందని డీపీవో వివరించారు.
ముగిసిన జాతీయ మహాసభలు


