పెద్దపల్లిరూరల్: తన నియోజకవర్గంలో అకా ల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. హైదరాబాద్‌లో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన కలిసి వినతిపత్రం అందించారు. వరి, మొక్కజొన్న, కూరగాయల రైతులు అకాల వర్షాలతో నష్టపోయారని తెలిపారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో సర్వేచేసి పంట నష్టం అంచనా వేశారని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం బాధిత రైతులకు పరిహారం అందించాలని సీఎంను అభ్యర్థించారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
ఎలిగేడు(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ రమేశ్, డిపార్ట్‌మెంట్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.
అవార్డు గ్రహీతకు అభినందన
పెద్దపల్లిరూరల్: కాసులపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్రం మల్లారెడ్డి జాతీయస్థాయి అవార్డు సాధించడం జిల్లాకు గర్వకారణమని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం మల్లారెడ్డిని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డితో కలిసి అభినందించారు. సాగు విధానంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుడి సాధించేలా ఆధునిక పద్ధుతులను అవలబించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు విద్యార్థిని ఎంపిక
ముత్తారం(మంథని): ధర్యపూర్ మోడల్ స్కూ ల్ విద్యార్థిని మెట్టు హాసిని మల్లేషియాలో మే 7 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికై ంది. ఆమెను ప్రిన్సిపాల్ సంతోష్, ఉపాధ్యాయులు సోమ వారం అభినందించారు. హాసిని తల్లిదండ్రులు నర్సింగం, దేవి మంథనిలో నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి కరాటే అంటే తనకెంతో ఇష్టమని హాసిని చెబుతోంది.
‘టీబీ ముక్త్ భారత్’ సాధిద్దాం
పెద్దపల్లిరూరల్: క్షయ నిర్మూలనపై ప్రజలు అ వగాహన పెంపొందించుకోవాలని జిల్లా వై ద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమా రి సూచించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సోమవారం అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్‌భారత్ సాధించేలా ప్రణాళిక రూపొందించిందన్నారు. 100రోజుల పాటు నిర్వహించిన నిక్షయ్ శిబిర్ ద్వారా 1,32,944 మందికి పరీక్షలు నిర్వహించి 14,723 మందిని అనుమానితులుగా గుర్తించామని వివరించారు. వారిలో 502 మందిని వ్యాధిగ్రస్తులుగా గుర్తించి మందులు అందించామని పేర్కొన్నారు. ఉత్తమ సేవలందించిన పలువురిని ఈ సందర్భంగా సత్కరించారు. ప్రోగ్రాం అధికారి సుధాకర్‌రెడ్డి, శ్రీరాములు, వాణిశ్రీ, కిరణ్‌కుమార్, శ్రవణ్‌కుమార్, రెడ్‌క్రా స్ సొసైటీ కన్వీనర్ రాజగోపాల్ పాల్గొన్నారు.
రైతులకు పరిహారం ఇవ్వండి
రైతులకు పరిహారం ఇవ్వండి
రైతులకు పరిహారం ఇవ్వండి