రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
మంథని: వరంగల్ – మంచిర్యాల మధ్య చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేలో భాగంగా చేపట్టిన బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. పట్టణంలో బుధవారం ప ర్యటించిన కలెక్టర్.. ఆర్డీవో కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, అ డవిసోమన్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. జాతీయ రహదారి ప్యాకేజీ–1లో భాగంగా మంథని మండలం పుట్టపాక వరకు ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తిచేశామని, రోడ్డు అలైన్‌మెంట్ లోపల రోడ్డు నిర్మించేందుకు వీలుగా పిచ్చిమొక్కలు తొలిగించాలని, బుషెస్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. డివిజన్ పరిధిలో కార్యాలయ స ముదాయం నిర్మించుకునేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రెనోవేషన్ పనులను పరిశీలించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మంథని ప్రాంతానికి గైనకాలజిస్ట్‌ను కేటాయించామని తెలిపారు. మంథని మాతా శిశు ఆస్పత్రిలో ఈనెల 22 నుంచి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పు రోగతిని యాప్‌లో నమోదు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. ఆర్డీవో సురేశ్, ఇన్‌చార్జి తహసీల్దార్ గిరి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాన్‌హోళ్లకు వెంటనే మరమ్మతు చేయాలి
కోల్‌సిటీ(రామగుండం): నగర పరిధిలో ప్రమాదకరంగా ఉన్న మ్యాన్‌హోళ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. బుధవారం 11, 33వ డివి జన్లలో ప్రమాదకరంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఆమె పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ప్రశాంత్‌నగర్‌లోని మల్కాపూర్ చెరువును పరిశీలించారు. చెరువుకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని సూచించారు. మల్కాపూర్ చె రువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశో ర్ ఝాను అరుణశ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంబంధించిన కట్టడాలు, ఆస్తిపన్ను చెల్లింపులపై సీపీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామణ్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లిరూరల్: ఇంటింటా పర్యటిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో పాలుపంచుకుంటున్న తమ సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. అంతకుముందు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఆశ వర్కర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని, నెల వేతనం రూ.18వేలకు పెంచాలని యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జ్యోతి డిమాండ్ చేశారు. నాయకులు రవీందర్, శారద, జ్యోతి, సువర్ణ, రూపారాణి, హేమలత, రేణుక, శివలీల, మంజుల, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
Comments
Please login to add a commentAdd a comment