సామర్థ్యానికి మించి రవాణా
రామగుండం: అంతర్గాం నుంచి ఎన్టీపీసీ బూడిద, ముర్మూర్ నుంచి రాజీవ్ రహదారి ద్వారా చెరువుమట్టి భారీగా రవాణా అవుతోంది. గోలివాడ రీచ్ నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ట్రాక్టర్లతో ఇసుక నిత్యం తరలిపోతోంది. ఈ వాహనాలతో గ్రామీణ రహదారులపై అలజడి రేగుతోంది. సామర్‌ాధ్యనికి మించి మట్టి, బూడిద తరలిస్తున్నారు. బుగ్గ రోడ్డు నుంచి అంతర్గాం మండల పరిషత్ జంక్షన్ వద్ద కూడలి ఉంది. అక్కడ వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ వాహనాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతర్గాం జంక్షన్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కూడలిలో రద్దీ అధికంగా ఉంటుంది. అయితే, మట్టి, బూడిద, ఇసుక తరలించే వాహనాలతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. మూలమలుపులు, కూడళ్ల వద్ద భారీ వాహనాల వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది.
ఉచిత ఇసుక రవాణాతో
ట్రాక్టర్ల ఇష్టారాజ్యం..
గోలివాడ రీచ్ నుంచి స్థానిక అవసరాలకు ఇసుకను ఉచితంగా తరలించే అవకాశంఉంది. దీంతో ట్రాక్టర్ యజమానులు అతివేగంగా రాకపోకలు సాగిస్తున్నారు. కొందరు మైనర్లకు ట్రాక్టర్లు అప్పగించడంతో ద్విచక్ర వాహనాలతో పోటీపడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. తద్వారా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవర్‌లోడ్, అతివేగంతో వెళ్తున్న వాహనాలను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు.
● భారీటిప్పర్లలో బూడిద, ఇసుక, మట్టి తరలింపు
Comments
Please login to add a commentAdd a comment