ప్రజారంజకంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉంది. స్పష్టమైన వైఖరి, అద్భుతమైన విజన్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేటాయింపులు కూడా అలాగే ఉన్నాయి. ఇరిగేషన్, విద్యుత్, చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశాం. రామగుండం నియోజకవర్గానికి కేటాయింపులు జరిగాయి. దేశంలోనే అత్యున్నతస్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేలా ఉంది.
– ఎంఎస్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం
సంక్షేమానికి ప్రాధాన్యం
బడ్జెట్ చాలా బాగుంది. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చేశా రు. విద్యావంతులైన యువతకు స్వయం ఉపాధి మార్గాలను చూపేలా రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6వేల కోట్లు కేటాయించడం హర్షణీయం.
– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి
ప్రజారంజకంగా ఉంది
Comments
Please login to add a commentAdd a comment