టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
పెద్దపల్లిరూరల్: పదో వార్షిక తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో బుధవారం ఆయన సమీక్షించారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 7 వేల మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఇందుకో సం 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని, సమీక్ష సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపించాలని ఆదేశించారు. పారామెడికల్ సి బ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఈవో మాధవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హైస్కూల్‌లో గ్రీవెన్స్ బాక్స్
రామగుండం: పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో గర్ల్ చై ల్డ్ ఎంపవర్‌మెంట్ క్లబ్ ఏర్పాటు చేశారు. హెచ్‌ఎం చైర్‌పర్సన్‌గా, ఉపాధ్యాయురాలు కన్వీన ర్, ప్రతీ తరగతి నుంచి ఇద్దరు విద్యార్థినులను కమిటీ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. బాలికలపై అఘాయిత్యాలను పాఠశాలస్థాయి నుంచే ఎదుర్కొనేందుకు వీలుగా గ్రీవెన్స్ బాక్సు ఏ ర్పాటు చేశారు. బాలికలపై లైంగిక దాడులు, అసభ్యకర ప్రవర్తన, అవమానకర కామెంట్స్, కించపరిచే చేష్టలు తదితర సమస్యలపై ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. ప్రధానోపాధ్యా యురాలు అజ్మీరా శారద చైర్‌పర్సన్‌గా, కన్వీనర్‌గా హిందీ ఉపాధ్యాయురాలు ఎం.హేమలత వ్యవహరించనున్నారు.
సుల్తాన్‌పూర్‌లో రాజస్తాన్ బృందం
ఎలిగేడు/సుల్తానాబాద్(పెద్దపల్లి): రాజస్తాన్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు సుల్తాన్‌పూర్, సుల్తానాబాద్‌లో బుధవారం పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులు, పచ్చదనం, పరిశుభ్రతపై ఆరా తీశారు. ఎరువుల తయారీ విధానం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. స్కూళ్లలో సహజ సిద్ధంగా పెంచుతు న్న కూరగాయలు, సౌరశక్తి పనులను పరిశీలించారు. డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీడీవోలు భాస్కర్‌రావు, దివ్యదర్శన్‌రావు, ఎంపీవోలు ఆ రిఫ్, సమ్మిరెడి, ఎస్‌బీఎం కో ఆర్డినేటర్ రాఘవులు, హెచ్‌ఎం నరేంద్రచారి పాల్గొన్నారు.
పత్తి క్వింటాల్ రూ.7,087
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.7,087 ధర పలికింది. కనిష్టంగా రూ.5,561, సగటు రూ.6,717గా ధర నమోదైందని మార్కెట్‌కమిటీ కార్యదర్శి మనోహర్ తెలిపారు.
5 వరకు దరఖాస్తు చేయండి
పెద్దపల్లిరూరల్: జిల్లాకు చెందిన విద్యావంతులైన బీసీ నిరుద్యోగ వయువతీయువకులు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణం పొందేందుకు ఏప్రిల్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ అధికారి రంగారెడ్డి కోరారు. యువతకు స్వయం ఉపాధి క ల్పించి, ఆర్థికాభ్యున్నతి సాధించేందుకు ప్రభు త్వం ఈ పథకం అమల్లోకి తెచ్చిందని పేర్కొ న్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ యన వివరించారు. వివరాలకు కలెక్టరేట్‌లోని బీసీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఇంటర్ పరీక్షలకు 96.26 శాతం హాజరు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 96.26 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. మొత్తం 4,984 మంది విద్యార్థులకు 4,798 మంది హాజరయ్యారని ఆమె వివరించారు.
టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
Comments
Please login to add a commentAdd a comment