గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలోని జనగామ పురాతన శివాలయం అభివృద్ధికి రూ.6 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకి మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి లేఖలు అందజేశారు. రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఆర్టిజెన్‌లను ఉద్యోగులగా గుర్తించాలని, పెండింగ్ డిపెండెంట్ల మారుపేర్ల బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.