పెద్దపల్లిరూరల్: అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అ న్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే విజయరమణరావు భరోసా ఇచ్చారు. భోజన్నపేట, చీకురాయి, హన్మంతునిపేట, రాంపల్లి గ్రామాల్లో వ డగళ్లకు దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. కాలువ చివరి ఆయకట్టుకూ సా గునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. డీఏవో ఆదిరెడ్డి, ఏవో అలివేణి, రైతులు, నాయకులు ఉన్నారు.
ఉదయ్‌నగర్‌లో కమాన్ ప్రారంభం
జిల్లా కేంద్రంలోని ఉదయ్‌నగర్ కాలనీకి వెళ్లే ప్ర ధాన రోడ్డుపై మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, సురేందర్ సొంత డబ్బు వెచ్చించి ని ర్మించిన ప్రవేశద్వారం (కమాన్)ను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు.
రైతులను ఆదుకుంటాం
జూలపల్లి/ఎలిగేడు(పెద్దపల్లి): పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జూలపల్లి మండలం జూలపల్లి, కోనరావుపేట, ఎలిగేడు మండలం ధూళికట్టలో ఆయన పర్యటించారు.
ఎమ్మెల్యే విజయరమణారావు భరోసా