రామగుండం: అంతర్జాతీయ ప్రమాణాలతో రామగుండం రైల్వేస్టేషన్‌ను ఎయిర్ పోర్ట్‌ను తలదన్నేలా ఆధునికీకరిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. రామగుండం రైల్వేస్టేషన్ పనులను శుక్రవారం పరిశీలించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.26.5 కోట్లతో రైల్వేస్టేషన్ ఆధునికీకరణ చేపట్టామని, ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. పది రోజుల్లోగా రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తామని అన్నారు. రైల్వేస్టేషన్‌ను కలియ తిరిగిన అనంతరం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు.