జ్యోతినగర్/కోల్‌సిటీ(రామగుండం): నగర ప్ర జలకు రోజూ తాగునీరు సరఫరా చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ అన్నారు. భీమునిపట్నం, అన్నపూర్ణకాలనీల్లో రక్షిత మంచినీటి సరఫరా ట్రయల్ రన్, భీమునిపట్నం, హెలిప్యాడ్ ట్యాంకులు, ఇందిరమ్మకాలనీ, దుర్గానగర్‌లోని పార్క్‌లను ఆమె శుక్రవారం పరిశీలించారు. పార్కులు, పట్టణ ప్రకృతి వనాల్లో పచ్చదనం రూపొందించడానికి చ ర్యలు తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈ షాభాజ్, ఏఈ తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
రేపు క్రీడాకారుల ఎంపిక
రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన గోదావరిఖని సింగరేణి జవహర్‌లాల్ స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గణపతి తెలిపారు. అండర్–13, అండర్ –15లో క్రీడాకారుల ఎంపిక ఉంటుందన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రక్రియ ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన క్రీడాకారులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.
యంత్రాలను వినియోగించాలి
రామగిరి(మంథని): యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి బొగ్గు ఉత్పత్తికి అటంకం కలుగకుండా చూడాలని సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ ఎల్‌వీ సూర్యనారాయణ సూచించారు. ఆర్జీ–3 పరిధిలోని ఓసీపీ–2 గనిని శుక్రవారం ఆయన సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, యంత్రాల వినియోగం తదితర అంశాల పై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన క్వారీని పరిశీలించారు. ఇన్‌చార్జి ప్రాజెక్టు ఆఫీసర్ రఘుపతి, ప్రాజెక్టు ఇంజినీర్ టి.చంద్రశేఖర్, మేనేజర్ రామరావు, ఎస్టేట్ అధికారి ఐలయ్య, ఏరియా సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్, అధికారులు శ్రీనివాస్, రవీందర్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపాదనలు రూపొందిస్తాం
ముత్తారం(మంథని): ఎస్సారెస్పీ– 22ఆర్ కా లువలోని పూడిక తొలిగింపునకు ప్రతిపాదన లు తయారు చేస్తామని మంథని ఇరిగేషన్ ఈ ఈ బలరాం తెలిపారు. మైదంబండ నుంచి కేశనపల్లి, ముత్తారం, చివరి ఆయకట్టు అమ్రాబా ద్ వరకు ఎస్సారెస్పీ కాలువలను ఆయన శుక్రవారం పరిశీలించారు. కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యం మే రకు కాలువలు పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. నిధుల కోసం కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతామని ఈఈ తెలిపారు. డీఈఈ రాజేంద్రనాథ్, జేఈఈలు నితీశ్, ప్రసన్న, కాంగ్రెస్ నాయకుడు బియ్యని శివకుమార్ ఉన్నారు.
433 క్వింటాళ్ల పత్తి సేకరణ
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.7,153 ధర పలికింది. కనిష్టంగా రూ.5,009, సగటు రూ.7,069గా ధర నమోదైందని మార్కెట్ సెక్రటరీ మనోహర్ తెలిపారు. మొత్తం 433 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.
నిబంధనలు పాటించాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి అ న్నప్రసన్నకుమారి హెచ్చరించారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిబంధనలు పాటించని జిల్లాలోని ఓ స్కానింగ్ సెంటర్‌ను ఇప్పటికే సీజ్ చేశామని ఆమె తెలిపారు. మిగతా 30 స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి పలు సూచనలు చేశామని పేర్కొన్నారు. అందులో 15 సెంటర్లకు నోటీసులిచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్లు శ్రీధర్, వాణిశ్రీ, శ్రీదేవి, రవీందర్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ రాజగోపాల్, సరస్వతి, జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
రోజూ తాగునీటి సరఫరా
రోజూ తాగునీటి సరఫరా