మిగిలింది కొద్దిరోజులే..
● 31 వరకు సీపీఆర్‌ఎంఎస్ గడువు
గోదావరిఖని: వైద్యచికిత్సలపై రిటైర్డ్ కార్మికు లు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం క్యాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్‌మెంట్ స్కీం(సీపీఆర్‌ఎస్)ను 2018 నుంచి అమలు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రిటైర్డ్ కార్మికులు ఇందులో సభ్యులుగా చేరేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 31వ తేదీ వరకు మరోసారి గడువు విధించింది. సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు ఇదే చివరి అవకాశమని పేర్కొంది.
స్కీంలో 35 వేల మంది చేరిక..
పథకం ప్రారంభించిన సుమారు ఏడేళ్లలో దాదా పు 35 వేల మంది రిటైర్డ్ కార్మికులు ఇందులో చే రారు. ప్రతీసభ్యుడు రూ.40వేలు చెల్లిస్తే.. యాజమాన్యం మరో రూ.18వేలు కలిపి ఈ పథకం కింద జమచేస్తోంది. దీనిద్వారా రిటైర్డ్ కార్మికుడు, అతడి భార్య తమ జీవితకాలంలో గరిష్టంగా రూ.8లక్షల వరకు వైద్య సదుపాయం పొందే వీలుంది. అత్యవసర పరిస్థితుల్లో నగదు చెల్లించి వైద్య చికిత్స పొందినా ఆ తర్వాత బిల్లులు క్లెయి మ్ చేసుకునే వీలు కల్పించారు. ప్రాణాంతక, దీర్ఘకాలిక, కాన్సర్ లాంటి వ్యాధులకు గరిష్ట పరిమితి ఏమీ లేదు. మలిదశలో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని యాజమాన్యం చెబుతోంది.
సీపీఆర్‌ఎంఎస్ వివరాలు..
పథకంలో చేరిన సభ్యులు 35,000
జమైన సొమ్ము(రూ.కోట్లలో) 400
రిటైర్డ్ కార్మికుల వాటా(రూ.కోట్లలో) 250
యాజమాన్యం వాటా(రూ.కోట్లలో) 150
గతేడాది వైద్యం కోసం చెల్లించిన
సొమ్ము(రూ.కోట్లలో) 90
Comments
Please login to add a commentAdd a comment