● కలెక్టర్ కోయ శ్రీహర్ష
ముత్తారం(మంథని): జాయతీ రహదారి కోసం భూములిచ్చిన నిర్వాసితులకు నగదు చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కొయ శ్రీహర్ష తెలిపారు. ధర్యపూర్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రం, స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన బుధవారం తనిఖీచేశారు. బోర్లు, వ్యవసాయ బావులు, చెట్లు, ఇతర కట్టడాలకు పరిహారం అంది స్తామని, ఇందుకు అవసరమైన నిధుల కోసం జా తీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌కు త్వరగా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఎంపీడీవో సురేశ్, ఎంపీవో గోవర్ధన్, ప్రిన్సిపాల్ సంతోష్, మాజీ జెడ్పీటీసీ చోప్పరి సదానందం ఉన్నారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పాండవులగుట్ట భూములను ఆయన పరిశీలించా రు. ప్రభుత్వ భూములకు బోర్డులు, హద్దులు ఏర్పా టు చేయలని తహసీల్దార్ జగదీశ్వర్‌రావును ఆదేశించారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శంకర్, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.
యువతకు ఉచిత శిక్షణ
సుల్తానాబాద్‌రూరల్: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యే యువతకు ఉచిత శిక్షణ ఇస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇందుకోసం సెంటినరీకాలనీలోని రాణీరుద్రమదేవి స్టేడియంలో దేహదారుఢ్య, మెడికల్, రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. 17–21 ఏళ్ల మధ్య వయసుగలవారు నేరుగా స్టేడియంలోకి హాజరు కావాలన్నారు.
విధులను పకడ్బందీగా నిర్వహించాలి
మంథని: అఽధికారులు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ డివిజన్ అఽధికారి, పురపాలక సంఘ భవనం పనులను ఆయన పరిశీలించారు. నిర్దిష్ట సమయంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఇన్‌చార్జి తహసీల్దార్ గిరి ఉన్నారు.