ఎవరూ కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ జోలికి పోవద్దు. అవన్నీ మోసపూరితమైనవే. ఆన్‌లైన్ ఊబిలోకి కూరుకుపోయిన వారు ఎవరూ బాగుపడలేదు. నా భర్త తెలియక డబ్బులు పెట్టి నిండా మునిగాడు. చివరికి ప్రాణాలు సైతం తీసుకున్నాడు. మేము ఒంటరివారమయ్యాం. ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాలాంటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.
– బండి స్వప్న, సింగారం
తల్లిదండ్రులు నిఘా పెట్టాలి
ఐపీఎల్ బెట్టింగ్‌పై నిఘా ఉంచాం. అన్ని పోలీస్‌స్టేషన్లలో అప్రమత్తం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలపై నిఘా పెట్టాలి. బెట్టింగ్‌లతో జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. కేసులు నమోదైతే భవిష్యత్‌లో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదు.
– కరుణాకర్, డీసీపీ పెద్దపల్లి
మానసిక ఒత్తిడితోనే
ఈజీగా డబ్బు సంపాదించాలే ఆశతో యువత బెట్టింగ్ ప్రారంభిస్తారు. మొదట డబ్బులు వస్తుంటే ఆశతో ముందుకెళ్తారు. ఆ తర్వాత నష్టపోతుంటే అప్పులు భారంగా మారి అసాధారణమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక నష్టాలు వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూ పుతాయి. ఈ ఒత్తిళ్లు వారికి అదనపు భయం, ఒంటరితనంతో ఆత్మహత్య ఆలోచనలు కలుగుతాయి. ఇలాంటి వారిని గుర్తించి వారు ఒత్తిడిని జయించాలంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు సమర్థవంతమైన మద్దతు ఇవ్వాలి. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
– ప్రీతి, సైకియాట్రిస్టు
ఎవరూ వాటి జోలికి పోవద్దు