వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
● అదనపు కలెక్టర్ అరుణశ్రీ
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లావాసులు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అ రుణశ్రీ సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎండల తీవ్రత, సీజనల్ వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై బుధవారం సమీక్షించారు. అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు లో జిల్లా మూడోస్థానంలో ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు వడగాల్పుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ పనివేళలు మార్చాలని, ఆశ కార్యకర్తల నుంచి జిల్లా అధికారుల వరకు ప్రతీఒక్కరి వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకో వాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు, హమాలీలు, సిబ్బందికి వడదెబ్బ తగలకుండా టెంట్, తాగునీటి సౌక ర్యం కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.