సుల్తానాబాద్(పెద్దపల్లి) : రైతులను తప్పుదోవ పట్టించేందుకు రుణమా ఫీ కాలేదని బీజేపీ, బీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు అసత్య ప్రచా రం చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రూ.2 లక్షల వరకు రుణమాఫీ జరిగిందని, అవసరమైతే దీనిపై చర్చించడానికి ఎక్కడికై నా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ చేశారు. నాయకులు శ్రీనివాస్, అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్‌రావు, అధికారులు శ్రీమాల, వెంకటేశ్వర్లు, శశిధర్‌రావు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.