● నగరంలో పర్యటించిన ఢిల్లీ ప్రతినిధుల బృందం
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థను చెత్త రహిత ప్రాంతం(జీఎఫ్‌సీ)గా అభివృద్ధి చేస్తున్న తీరును ఢిల్లీ నుంచి వచ్చిన క్యాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) ప్రతినిధులు రంజిత్ పుత్ర, జీవన్ కిశోర్ నాయక్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలిరోజు స్థానిక 21వ, 22వ డివిజన్లలోని పాత రామగుండం, అయోధ్యనగర్‌లో పర్యటించిన ప్రతినిధులు.. పలు ఇళ్లలో తడి, పొడి చెత్తను సేకరిస్తున్న తీరుపై ఆరా తీశారు. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు, ఫొటోలను వారు సేకరించారు. స్థానికులతో మాట్లాడి పారిశుధ్యం పనితీరుపై అభిప్రాయాలను తీసుకున్నారు. రహదారులపై వీధి దీపాలు, ఫుట్‌పాత్‌లు, రోడ్లపై చెత్త కుప్పలను ప్రతినిధులు పరిశీలించారు. సుమారు వారం నుంచి పది రోజులపాటు క్యూసీఐ ప్రతినిధులు రామగుండం నగరంలోనే ఉంటారని సమాచారం. వీరి వెంట ఎన్విరాల్‌మెంట్ ఇంజినీరు మధూకర్, అధికారి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
రౌడీషీటర్లు ప్రవర్తన మార్చుకోవాలి
● పెద్దపల్లి ఏసీపీ కృష్ణ
సుల్తానాబాద్‌రూరల్: రౌడీషీటర్లు త మ పద్ధతులు మార్చుకుని సత్ప్రవర్త నతో వ్యవహరించాలని ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్‌లోని సుల్తానాబాద్, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, పొత్క పల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో గల రౌడీషీటర్లతో శనివారం సుల్తానాబాద్ సర్కిల్ కా ర్యాలయంలో సమావేశం నిర్వహించారు. సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ, ప్రజలపై గొడవలు, అల్లర్లు, బెదిరింపులకు పాల్పడితే రౌడీషీట్ తెరుస్తామన్నారు. ఇలా చేయడం ద్వారా పదేపదే జై లుకు వెళ్తారని, అలాకాకుండా సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన సూచించారు. రౌడీషీటర్లు మళ్లీ గొడవలకు దిగి తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని కోరారు. అందరితో కలిసి సంతోషంగా గడపాలని ఆయన అన్నారు.
రామగుండం బల్దియా క్లీన్‌పై క్యూసీఐ నజర్