రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ ప్రారంభానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి, సుందరీకరణ పనులు శరవేగవంతంగా సాగుతున్నాయి. ఈనెల 21న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పనులను తనిఖీ చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు ప్రస్తుతం పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 30లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశాలు ఉన్నాయి. అమృత్ భారత్‌లో భాగంగా రూ.26.50 కోట్ల అంచనా వ్యయంతో 2023 ఆగస్టు 6న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో పనులకు పచ్చజెండా ఊపారు.
‘కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్ ఘనత మాదే’
రామగుండం: థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయించిన ఘనత తమకే దక్కుతుందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం కుమారస్వామి అన్నారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వేలాది మంది ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించేందుకు తమ యూనియన్ విశేషంగా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకు లు అబ్దుల్ తఖీ, యూనుసొద్దీన్, దుర్గయ్య, నీలం శంకర్, ఖమరొద్దీన్, రషీద్, బంగారి రా జు, రాధ, వెల్లుల స్వామి, ఎ.రాజేందర్, జ్ఞాన శేఖర్, చక్రవర్తి, చంటి, ఆసిఫ్, పోచం, కృష్ణ, గౌతమ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితుల యాత్ర’ చేయాలి
రామగుండం: గోదావరి గోస పాదయాత్ర క న్నా ముందు ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితుల యాత్ర చేపడితే మోసపోయిన వారికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ సూచించారు. అంతర్గాంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హ యాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కనీసం తా గు, సాగునీరందించలేదన్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతలకు అప్పటి నేతలు శంకుస్థాపన చేసి మ ధ్యలోనే వదిలేస్తే.. మోటార్లు, సబ్‌స్టేషన్ పను లు పూర్తిచేసిన ఘనత తమదన్నారు. అధిష్టా నం మెప్పుకోసం, రాజకీయ లబ్ధికి కోరుకంటి చందర్ గోదావరి గోస పేరిట పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. ప్రతినిధులు ఉరిమెట్ల రాజలింగం, గాదె సుధాకర్, పూదరి సత్తయ్య గౌడ్, ముచ్చకుర్తి రమేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
వేలం డబ్బు జమచేయాలి
పెద్దపల్లిరూరల్: యాసంగి(2022–23 సీజన్) ధాన్యం వేలం పాట ద్వారా సమకూరిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు సకాలంలో జమచేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మిల్లర్లు, సంబంధిత శాఖ అధికారులతో సోమవారం ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు. యాసంగి(2022–23) పంట దిగుబడులను ప్రభుత్వం వేలం వేసిందని, వాటిని దక్కించుకున్న మిల్లర్లు సత్వరమే డబ్బు చెల్లించాలని అన్నారు. సమావేశంలో డీఎస్‌వో రాజేందర్, సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్, రైస్‌మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు 96.4శాతం హాజరు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 96.4శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్/ఎకనామిక్స్ పరీక్షకు 5,500 మంది హాజరుకావాల్సి ఉండగా 5,304 మంది హాజరయ్యారని ఆమె వివరించారు.
ప్రారంభానికి రైల్వేస్టేషన్ సిద్ధం
ప్రారంభానికి రైల్వేస్టేషన్ సిద్ధం
ప్రారంభానికి రైల్వేస్టేషన్ సిద్ధం