
ప్రభుత్వాలు సంపన్నుల కోసమేనా?
కోల్‌సిటీ(రామగుండం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్నుల కోసమే పనిచేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం మహాధర్నా నిర్వహించారు. తొలుత టీ జంక్షన్‌లోని అంబేడ్కర్, రాజేశ్ థియేటర్ కూడలిలోని జ్యోతిబా పూలే విగ్రహాలకు జాన్‌వెస్లీతోపాటు బొజ్జా బిక్షమయ్య, భూపాల్ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బల్దియాకు చేరుకుని ఆయన మాట్లాడారు. బల్దియాలో సీపీఎం భూపోరాటం ద్వారా 600 మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇప్పించామన్నారు. వీరందరికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పట్టాలు, ఇంటి నంబర్లు ఇవ్వాలని కోరారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, పింఛన్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఆయన చేశారు. సింగరేణి, మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అనంతరం బల్దియా డిప్యూ టీ కమిషనర్ వెంకటస్వామికి వినతిపత్రాన్ని సమర్పించారు. నాయకులు వై.యాకయ్య, వే ల్పుల కుమారస్వామి, ఎ.ముత్యంరావు, ఎం. రామాచారి, సారయ్య, శ్రీనివాస్, శంకర్, బిక్షపతి, శైలజ, గణేశ్, జ్యోతి, రవీందర్, అశోక్, నాగమణి, ఎ.మహేశ్వరి, ఉపేందర్, సంజీవ్, లక్ష్మారెడ్డి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఎం నాయకులు జాన్‌వెస్లీకి స్వాగతం పలికి బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి –కూనారం మార్గంలోని రైల్వేక్రాసింగ్ వద్ద చేపట్టిన రైల్వే వంతెన పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. నాయకులు ముత్యంరావు, భూపాల్, భిక్షమయ్య, రమేశ్, అశోక్, రవీందర్, జ్యోతి, శ్రావణ్, ప్రశాంత్, దిలీప్, నవీన్, వెంకటస్వామి, ఖాజా, రాజమల్లు, సాగర్ పాల్గొన్నారు.
పేదలకు ఇళ్లు కూడా ఇవ్వడంలేదు
తక్షణమే ఇంటినంబర్లు, పట్టాలివ్వాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
రామగుండం బల్దియా ఎదుట ధర్నా