ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. రూ33,59,130 నగదు, 40.9గ్రాముల మి శ్రమ బంగారం, 7.2కిలోల మిశ్రమ వెండి సమకూరినట్లు పర్యవేక్షణాధికారి శ్రీనివాస్ తెలిపారు. బ్యాంకుసిబ్బంది, పోలీసులు, రా జరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
బ్రెడ్ ప్యాకెట్లపై తయారీ తేదీలు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని బేకరీలు, స్వీట్‌హౌజుల్లో నాణ్యతా లోపంతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారని ఈనెల 21న ‘తింటే బేజారే..’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో సంబంధిత అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి జరిమానా విధిస్తుండడంతో వ్యాపారుల్లో కూడా మార్పు మొదలయింది. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన ఓ సంస్థ తయారు చేస్తున్న బ్రెడ్‌పై లైసెన్స్ నంబర్‌తోపాటు తయారు చేసిన తేదీ, ఎకై ్స్పరీ డేట్, ధర, బరువు తదితర వివరాలను ముద్రించి విక్రయిస్తోంది. ఈసందర్భంగా వ్యాపారుల్లో మార్పు వచ్చేలా చొరవ తీసుకున్న ‘సాక్షి’ని పలువురు అభినందిస్తున్నారు. తినుబండరాలను విక్రయిస్తున్న వ్యాపారస్తులు తప్పనిసరిగా బాధ్యతతో ఉండాలని కోరుతున్నారు.
మతసామరస్యానికి ప్రతీక రంజాన్
సుల్తానాబాద్(పెద్దపల్లి): మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. గురువారం రాత్రి సుల్తానాబాద్ పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ రాంచందర్‌రావు, జిల్లా గ్రాంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, మున్సిపల్ కమిషనర్ మహ్మద్‌నియాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌అలీ పాల్గొన్నారు.
విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేయండి
● అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
గోదావరిఖని(రామగుండం): రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ సారథ్యంలో 62 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను రామగుండంలో నిర్మించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి బీఆర్‌ఎస్ యాదాద్రికి తరలించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచే రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఈప్రాంతాన్ని సందర్శించిన సమయంలో దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఈక్రమంలో వెంటనే ప్లాంట్ ఏర్పాటుకు తగిన సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్స్‌ను రెగ్యులర్ చేయాలని కోరారు.
ఓదెల మల్లన్న ఆదాయం రూ.33.59లక్షలు
ఓదెల మల్లన్న ఆదాయం రూ.33.59లక్షలు