
ఉగాది ఉత్సవాలకు రండి
కమాన్‌పూర్(మంథని): మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయంలో ఈనెల 30న నిర్వహించే ఉగాది ఉత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆదివారం మంథని పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్‌బాబును ఆలయ ఈవో కాంతరెడ్డి తదితరులు కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.
బీసీ కులగణన చారిత్రకం
ధర్మారం(ధర్మపురి): బీసీ కుల గణన చారిత్ర కమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బీసీ కుల గణన చేపట్టి, చట్టసభల్లో రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన విప్‌కు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పత్తిపాక క్రాస్‌రోడ్డు వద్ద ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కులగణన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. అనంతరం ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కృతజ్ఞత సభ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, లావుడ్య రూప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ‘ఆర్టిజన్ల గర్జన’
పెద్దపల్లిరూరల్: ఆర్టిజన్ల సమస్యలను ప్రభు త్వం సత్వరమే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ డిమాండ్ చేశా రు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టను న్న ఆర్టిజన్ల గర్జన సభను విజయవంతం చే యాలని ఆయన కోరారు. ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేయాలని ఆయ న పేర్కొన్నారు. విద్యార్హతలను బట్టి సబ్ ఇంజినీర్, జేఎల్‌ఎం, జూనియర్ అసిస్టెంట్, ఆఫీ స్ సబార్టినేట్ పోస్టుల్లో భర్తీ చేయాలని ఆయన అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ పలుమార్లు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు విన్నవించామని ఆయన గుర్తుచేశారు.
పోరాటాలతోనే కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు
గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుకోసం పోరాటాలకు సిద్ధం కా వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ కోరారు. ఆదివారం కాంట్రాక్టు కార్మిక సంఘం సమావేశాన్ని ఆ సంఘం బుర్ర తిరుపతి అధ్య క్షతన నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం, యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వేతనాలను పెంచాలన్నారు. ఈఎస్‌ఐ వేతనాలు అమలు చేయాలని, చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు, సెలవులను వర్తింపజేయాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండీ అక్బర్‌అలీ, ఇన్‌చార్జి ముస్కే సమ్మయ్య, నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, యర్రగాని కృష్ణయ్య, కిష్టఫర్, రాజరత్నం, చంద్రమౌళి, గౌస్, జెట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతలను ఆదుకోవాలి
పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలో కురిసిన వడగళ్లకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, అసెంబ్లీ ఇన్‌చార్జి దుగ్యాల ప్రదీప్‌కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ తదితర మండలాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. దిగుబడులు గణనీయంగా తగ్గి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాధికారులతో పంట నష్టంపై సర్వే చేయించి ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉగాది ఉత్సవాలకు రండి

ఉగాది ఉత్సవాలకు రండి