నేడు బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం● ముఖ్య అతిథు
కరీంనగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నాహాక సమావేశం ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్‌లో జరగనుంది. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, బీఆర్‌ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరు కానున్నారు. శనివారం వీ– కన్వెన్షన్ ఫంక్షన్‌హాల్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రత్యేక పరిస్థితుల్లోనే గర్భస్రావానికి అనుమతి
పెద్దపల్లిరూరల్: గర్భస్రావాన్ని ఇష్టానుసారంగా చేస్తే చర్యలు తప్పవని, ప్రత్యేక పరిస్థితుల్లోనే అనుమతినిస్తారని డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శనివారం ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్టులకు పలు సూచనలు చేశారు. జిల్లా లో 12 ఆస్పత్రులకే అనుమతి ఉందని, అందు లో ఇటీవల ఓ ఆస్పత్రిని సీజ్ చేశామన్నారు. గర్భవతికి మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగే అవకాశమున్నప్పుడు, వైకల్యం గల బిడ్డ పుట్టే అవకాశం ఉన్నప్పుడు, బలత్కా రానికి గురై గర్భం దాల్చినప్పుడే గర్భ స్రావం చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు.
నీటిని పొదుపుగా వినియోగించాలి
జ్యోతినగర్(రామగుండం): నీటిని పొదుపుగా వినియోగించాలని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సమంత సూచించారు. ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీలో శనివారం నిర్వహించిన కార్యక్రమాన్ని చందన్‌కుమార్ సమంత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై శిక్షణ, పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త, సాంకేతిక సలహాదారు డాక్టర్ ఎన్.రవీందర్ ‘నీటి ప్రాముఖ్యత –నీటి దినోత్సవం ప్రాముఖ్యత’ అంశంపై ప్రసంగించారు. నీటి సంరక్షణపై ఉద్యోగులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. జీఎం(ఓఅండ్ ఎం) ఏఆర్ దాస్, జీఎం(ఆపరేషన్స్) కేసీ సింఘారాయ్ తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ హిందీ పరీక్షకు 7,374 మంది హాజరు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పదో తరగతి హిందీ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 7,383 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7,374 మంది విద్యార్థులు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫ్లయింగ్‌స్వాడ్ బృందాలతోపాటు ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారని పేర్కొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని శంకర్‌గంజ్ ప్రాంతంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. విద్యుత్ మరమ్మతు ల నిర్వహణ కారణంగా ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
నేడు బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం● ముఖ్య అతిథు
నేడు బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం● ముఖ్య అతిథు