కొందరు వ్యాపారులు లాభాపేక్షతో అనారోగ్యానికి గురైన వాటిని వధించి విక్రయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. మేకలు, గొర్రెలను పరిశీలించిన తర్వాతనే స్లాటర్ హౌస్‌లో వధించాలి.
– మార్కపురి సూర్య, వినియోగదారు
ప్రాణాలతో చెలగాటమా?
బర్డ్స్‌ఫ్లూకు భయపడి ధర ఎక్కువైనా మటన్ కొంటున్న ప్రజల ప్రాణాలతో వ్యాపారులు, అధికారులు చెలగాటమాడుతున్నారు. మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా? అనేది ఎవరు ధ్రువీకరిస్తున్నారు? మాంసంపై ఎక్కడా మున్సిపల్ స్టాంప్ కనిపించడం లేదు.
– ఈదునూరి శంకర్, వినియోగదారు
చర్యలు తీసుకుంటాం
మాంసం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంచేవారిపై చర్యలు తీసుకుంటాం. రామగుండంలోని స్లాటర్‌హౌస్‌ను త్వరలో వినియోగంలోకి తీసుకొస్తాం. చనిపోయిన మేకలు, వధించిన తర్వాత వ్యర్థాలను నాలాల్లో వేస్తున్న వ్యాపారులపై జరినామా విధిస్తున్నాం.
– అరుణశ్రీ, కమిషనర్, రామగుండం బల్దియా
అనుమానాలకు తావిస్తోంది
అనుమానాలకు తావిస్తోంది