రూ.కోటి పరిహారం చెల్లించాలి
రామగుండం: టీటీఎస్ అంతర్గాంకు చెందిన ఆలకుంట సంపత్‌ది పోలీసు హత్యగానే భావిస్తున్నామని పౌరహక్కుల సంఘం నేతలు అన్నారు. మంగళవారం మృతుడి కుటుంబాన్ని వారు పరామర్శించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. సంపత్ ఆర్థికంగా నష్టపోయి జగిత్యాలలో ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొంది గల్ఫ్ ఏజెంట్‌గా పని చేశాడన్నారు. అతడితోపాటు తోడల్లుడు చిరంజీవితో కలిసి సేవలు అందించారని అన్నాడు. అయితే, గల్ఫ్ వెళ్లిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే సంపత్ మృతిచెందాడని హక్కుల నేతలు ఆరోపించారు. సంపత్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, ప్రభుత్వ హత్యగా గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులకు రూ.కోటి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర నేతలు మాదన కుమారస్వామి, నార వినోద్, బొంకూరి లక్ష్మణ్, రెడ్డిరాజుల సంపత్, బండారి రాజలింగయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మృతుడు సంపత్ కుటుంబాన్ని ఆదుకోవాలి
పౌరహక్కుల సంఘం నాయకుల డిమాండ్


