పెద్దపల్లిరూరల్: ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఆయన పలువురు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
● అడిషనల్ కలెక్టర్ వేణు
ప్రభుత్వ, అద్దె గోదాముల్లో టెండర్లతో జరిగే పనులు చేస్తున్న హమాలీలకు పనిభద్రత, ఈ పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలి. ఇందుకోసం కాంట్రాక్టర్, గోదాం యజమానులు, అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలి.
– తెలంగాణ హమాలీ
వర్కర్స్ యూనియన్ నేతలు
సుమారు 300మంది రైతులతో కలిసి పెద్దపల్లి ఎఫ్‌ఈడీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ స్థాపించాం. ఈ ప్రాంతంలోని రైతులు పండించిన ధాన్యం దిగుబడులను కొనుగోలు చేసే అవకాశం మాకు ఇవ్వండి. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – ఎర్రం మల్లారెడ్డి,
ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్
ఫేజ్–2తో ఇబ్బంది
అంత్యోదయ కార్డు మంజూరు చేయండి
నాకు రేషన్ కార్డు ఉంది. దీనిపై ఆరుకిలోల బియ్యం ఇస్తున్నారు. అంత్యోదయ కార్డుకు నాకు అన్ని అర్హతలున్నాయి. విచారణ జరిపి అంత్యోదయ కార్డు ఇప్పించి ఆదుకోవాలి.
– శేషగిరిరావు, గోదావరిఖని
పరిహారం ఇప్పించండి
జాతీయ రహదారి కింద పోయిన మా భూమి కి ప్రభుత్వం నుంచి పరిహారం అందించాలి. రెండో కిస్తీ పరిహారాన్ని వీలైనంత త్వరగా అందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
– విజయలక్ష్మి, నాగమణి, లక్కారం, మంఽథని మండలం
భద్రత కల్పించండి
ధాన్యం కొనుగోళ్లకు
అవకాశమివ్వండి
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి