గోదావరిఖని: రోడ్డు ప్రమాదాల నియంత్రణే ల క్ష్యంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. శుక్రవా రం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రోడ్డుసేఫ్టీపై సమీక్షించారు. ఎన్‌హెచ్–63, ఎన్‌హెచ్–363, ఎ స్‌హెచ్–1, ఎస్‌హెచ్–24, ఎస్‌హెచ్ –8 తదితర రోడ్లను గూగుల్ మ్యాప్ ద్వారా ఆయన పరిశీలించారు. 2022 నుంచి 2024 వరకు జరిగిన ప్రమా దాలు, మృతుల వివరాలు, ప్రమాదానికి గల కా రణాలు, నియంత్రణకు తీసుకొన్న చర్యలపై విశ్లేషించారు. బ్లాక్‌స్పాట్ల వద్ద రేడియం స్టికర్లతో కూ డిన సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైనచోట స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, లైట్లు, స్పీడ్ కెమెరాలు, జిబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నేరాల నియంత్రణకు విజబుల్ పోలీసింగ్ ముఖ్యమని సూచించారు. సమాచార వ్యవ స్థను పటిష్టం చేసుకోవాలని అన్నారు. డ్యూటీ సమయంలో సిబ్బంది, అధికారులు స్వీయ రక్షణ పాటించాలని సీపీ సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా