కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు కార్మిక ప్రయోజనాలే లక్ష్యంగా సమ్మె చేపడతాం. దీనికి అన్ని కార్మిక సంఘాలు మద్దతివ్వాలి. కలివచ్చే అన్ని సంఘాలతో ఒక్కరోజు టోకన్ సమ్మెను విజయవంతం చేస్తాం. కేంద్రం తీరుతో సింగరేణి పెద్దమొత్తంలో నష్టపోయింది. భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చేలా పోరాటాలకు సన్నద్ధం అవుతున్నాం.
– సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
కార్మిక చట్టాలను మార్పుచేయాలి. లేబర్ కోడ్‌లనే వెంటనే రద్దు చేయాలి. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కేంద్రం ఆలోచన. దీన్ని అడ్డుకోవాలని సమ్మెకు పిలుపునిచ్చాం. బొగ్గు గనుల ప్రైవేటీకరణ మానుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణిని కాపాడుకో వాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సంస్థకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి.
– తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు
విజయవంతం చేయాలి
ఒక్కరోజు సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి. కార్మిక చట్టాలు రద్దు చేసి, లేబర్ కోడ్‌లు అమలు చేయడం వల్ల కార్మికులకు తీరని నష్టం కలుగుతుంది. అలాగే బొగ్గు గనులను ప్రైవేట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కొత్తబ్లాక్‌లు సింగరేణికే అప్పగించాలి.
– రియాజ్‌అహ్మద్,
హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే..
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే..


