
బీఆర్‌ఎస్ పాలనలోనే నష్టం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): గత బీఆ ర్‌ఎస్ పదేళ్ల పాలనలోనే సింగరేణితో పాటు కార్మికులకు నష్టం జరిగిందని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ విమర్శించారు. ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం బొగ్గు గనుల వే లం పాటలో పాల్గొనకపోవడంతోనే ఒక్క బొగ్గుగని రాలేదన్నారు. రూ.35వేల కోట్ల విద్యుత్ బకాయిలను సింగరేణికి చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఏటా 70 మిలియన్ల బొ గ్గు ఉత్సతి చేయడంతోపాటు కార్మికుల సంక్షేహానికి తమ యూనియన్ కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం ఏఐటీ యూసీ నాయకులు ఐఎన్‌టీయూసీలో చేరారు. నాయకులు శంకర్ నాయక్, నరసింహారెడ్డి, ఽధర్మపురి, ఎండీ అక్ర మ్, వికాస్ కుమార్, సత్యనారాయణరెడ్డి, సంపత్‌రెడ్డి, నవీన్, మల్లేశ్, సదానందం, మోహన్, కనకయ్య, మార్కండేయ పాల్గొన్నారు.
ఒప్పందాన్ని అమలు చేయాలి
జ్యోతినగర్(రామగుండం): కార్మికుల సమస్య ల పరిష్కారానికి గతంలో కుదుర్చుకున్న ఒ ప్పందాన్ని అమలు చేయకపోగా సమస్యను జఠిలం చేస్తున్నారని కాంట్రాక్టు కార్మిక సంఘం నేత కౌశిక హరి అన్నారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద మంగళవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలపై స్పందించడం లేదన్నారు. ఒప్పందం జరిగిన అంశాలను పరిష్కరించకపోతే శనివా రం ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కదంబాపూర్ క్వారీలో విచారణ
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కదంబపూర్ లోని క్వారీలో ఆర్డీవో గంగయ్య, మైనింగ్ ఏడీ శ్రీనివాస్, ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ మంగళవా రం విచారణ చేపట్టారు. సర్వే నంబర్లు 507, 508లోని కేఎస్‌ఆర్ క్వారీలో అనుమతికి మించి గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారని తమకు ఫిర్యా దు అందిందని ఆర్డీవో తెలిపారు. దీంతో విచారణ చేశామన్నారు. తహసీల్దార్ రాంచందర్‌రావు, గిర్దావర్ వినోద్ పాల్గొన్నారు.
పత్తి క్వింటాల్ రూ.7,124
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,124 ధర పలికింది. కనిష్టంగా రూ.5,011, సగటు రూ.6,761 ధర నమోదైందని మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. పలువురు రైతుల నుంచి 384 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్ల ఆయన పేర్కొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపు గడువు పొడిగించాలి
పెద్దపల్లిరూరల్: ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఈనెలాఖరు వరకు ఇచ్చిన గడువును మరోనెల రోజులపాటు పొడిగించాలని రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎరుకల రమేశ్ కోరారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ను స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే, పలుకారణాలతో అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసు కోలేక పోతున్నారని పేర్కొన్నారు. గడువును పొడిగిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకోసం చొరవ చూపాలని ఆయన కోరారు.
సఖి కేంద్రానికి మహిళ తరలింపు
పెద్దపల్లిరూరల్: మతిస్థిమితం లేనిమహిళను మంగళవారం సఖికేంద్రానికి తరలించారు. అ డ్మినిస్ట్రేటర్ స్వప్న, సిబ్బంది ప్రత్యేక వాహనంలో బాధితురాలిని తరలించారు. వెంకటేశ్వర్లు, లక్ష్మీనర్సయ్య, సత్యనారాయణ ఇచ్చిన సమా చారంతో జిల్లా సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాల్ ఆ మహిళను సఖి కేంద్ర సిబ్బందితో తరలించారు. ఆ తర్వాత హైదరాబా ద్‌లోని అమ్మనాన్న ఆశ్రమానికి తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ పాలనలోనే నష్టం

బీఆర్‌ఎస్ పాలనలోనే నష్టం