గోదావరిఖని: సింగరేణి కార్మికుల మా రుపేర్ల సమస్య పరి ష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని రా మగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం వద్ద ఎమ్మెల్యే పలు సమస్యలు ప్రస్తావించగా సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. నియోజకవర్గ సమస్యలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలను సీఎం వద్ద ప్రస్తావించారు. సింగరేణి కార్మికుల సమస్యలు, మారుపేర్ల అంశం, కార్మికుల విజిలెన్స్ పెండింగ్ కేసుల గురించి వివరించారు. పారిశ్రామికాభివృద్ధి, పట్టణప్రగతి, రోడ్లు, డ్రైనేజీ, గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్య సేవల విస్తరణ వంటి ముఖ్యాంశాలను అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.
లంచం అడిగితే సమాచారమివ్వండి
పెద్దపల్లిరూరల్: ‘జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అన్నిసేవలను ఉచితంగా అందిస్తున్నాం.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం.. ఎవరైనా డబ్బులు అడిగితే సూపరింటెండెంట్ సెల్ నంబరు 84990 61999కు లేదా రీజినల్ మెడికల్ ఆఫీసర్ సెల్ నంబరు 94948 53906కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలి’ అని ఆస్పత్రి ఆవరణలో పోస్టర్లు అంటించారు.
నేతల త్యాగఫలమే వర్గీకరణ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఎమ్మార్పీఎస్ వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాజీలేని పోరాటం, అనేకమంది త్యాగాల ఫలితమే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభలో ఆమోదం లభించిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడంపై మండల కేంద్రంలో శుక్రవారం బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మూడు దశాబ్దాల కల సాకారమైందని నాయకులు అన్నారు. నాయకులు వంగళ తిరుపతిరెడ్డి, గంట రాములు యాదవ్, తులా మనోహార్‌రావు, బండ రవీందర్‌రెడ్డి, సబ్బని రాజమల్లు, దంతెనపెల్లి చిన్నస్వామి, దంతెనపెల్లి ధర్మయ్య, అక్కపాక తిరుపతి, ఉమామహేశ్వర్, తూండ్ల రాజయ్య, బర్ల తిరుపతి, మంతెన రామస్వామి, చలిగంటి స్వరూప, రాజేశం, శంకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి
రామగిరి(మంథని): లద్నాపూర్ నిర్వాసితుల కు పన్నూర్, రత్నాపూర్‌లో కేటాయించిన పునరావాస కేంద్రంలో మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు సింగరేణి అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రంలో రూ.2.66 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆర్జీ–3 జీఎం సుధాకర్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. పునరావాస కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రెండు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల, కమ్యూనిటీ హాల్, రామాలయం, రెండు వినాయక మండపాలకు భూమిపూజ చేసి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని వేణు అన్నారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన.. ఇతర సౌకర్యాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ సుమన్, ఎంపీడీవో శైలజారాణి, సింగరేణి అధికారులు రఘుపతి, ఐలయ్య, రాజేంద్రకుమార్, సుదర్శనం, శ్రీనివాస్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
మారుపేర్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలం
మారుపేర్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలం
మారుపేర్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలం