పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మినీట్యాంకు బండ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి సీపీ అంబర్‌కిషోర్ ఝా సమక్షంలో పోలీసు అధికారులు డ్రోన్ కెమెరాతో తనిఖీలు నిర్వహించారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను బహిరంగప్రదేశాల్లో సేవించే ఆకతాయిల భరతం పట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రధానకూడళ్లు, ఎల్లమ్మచెరువుకట్ట ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం దుకాణాలు, వ్యాపారసంస్థల సమయపాలన తీరు, ఆ సమయంలో బైక్‌లపై వస్తున్న వారి వివరాలు తెలుసుకున్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ గార్డులకు సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతాచర్యలు, నేరాలు ఇతర శాంతిభద్రతల విషయాలను డీసీపీ కరుణాకర్ వివరించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు మల్లేశ్, పలువురు అధికారులు ఉన్నారు.
● సీపీ అంబర్‌కిషోర్ ఝా