గోదావరిఖని: సైబర్ నేరగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇందుకోసం వారు రోజుకో మార్గం ఎంచుకుంటున్నారు. నిన్నామొటి వరకు డిజిటల్ అరెస్ట్.. గోల్డ్ ట్రేడింగ్ పేరిట మోసాలకు పాల్పడిన దగాకోరులు.. ప్రస్తుతం ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట ప్రజలకు వల విసురుతున్నారు. తొలు రూ.లక్షకు రూ.2 లక్షలు, రూ.2లక్షలకు రూ.4 లక్షల లాభాలు వస్తున్నాయంటూ ఆన్‌లైన్‌లో మెసేజ్ చూపిస్తున్నారు. ఆ తర్వాత సైట్ మూసేస్తున్నారు. ఇటీవల ఇలాంటి మోసమే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు సైబర్‌మోసగాళ్ల బారినపడి దశల వారీగా రూ.57లక్షలు ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టి మోసపోవడం కోల్‌బెల్ట్‌లో చర్చనీయాంశంగా మారింది.
మోసాలు.. అనేక రకాలు..
డిజిటల్ అరెస్ట్, జంప్‌డ్ డిపాజిట్ మనీ, మల్టీలెవల్ మార్కెటింగ్ తదితర వాటి పేరిట సైబర్ మోసగాళ్లు ఇప్పటిదాకా బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ అరచేతిలో ప్రపంచం చూపిస్తోంది. బ్యాంక్‌లావాదేవీలన్నీ యూపీఐ, ఫోన్‌పే, గూగుపే.. లాంటివన్నీ బ్యాంక్ లింక్‌ల ద్వారానే సాగుతున్నాయి. ఈక్రమంలో సైబర్‌నేరగాళ్లు ఇప్పుడు ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ నుంచే..
సైబర్‌నేరగాళ్లు ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాంబోడియా కేంద్రంగా సైబర్ నేరగాళ్లు ప్రజలకు వల విసురుతున్నారు. పెద్ద కార్యాలయాలు ప్రారంభించి తమకు సమీప, తెలిసిన వారితో బ్యాంకు ఖాతా లు ప్రారంభిస్తున్నారు. తాము కొట్టేసిన సొమ్ము ను తొలుత ఈ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఖాతాదారులకు సంబంధం లేకుండా ప్రతినెలా రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు బ్యాంకు కస్టమర్లకు పంపించడంతో వారు కూడా కిమ్మనకుండా ఉండిపోతున్నారు.
అత్యాశకు వెళ్లొద్దు
ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని కొందరు ఆశపడుతున్నారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు తొలుత రూ.లక్ష వరకు పెట్టుబడి పెడితే రూ.2 లక్షల లాభాలను ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారు. దీంతో తమకు లాభాలు వస్తున్నాయని ఆశపడుతూ ప్రజలు మళ్లీ పెట్టుబడి పెడుతున్నారు. ఆ తర్వాత మోసపోతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇలానే ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ.57లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. జిల్లావాసులు ఇలాంటి వ్యాపారాలపైనా అప్రమత్తంగా ఉండాలి.
– వెంకటరమణ,
ఏసీపీ, సైబర్‌క్రైం, రామగుండం
● ఆన్‌లైన్ వ్యాపారం పేరిట బురిడీ ● ఆశచూపించి రూ.లక్షల్
● ఆన్‌లైన్ వ్యాపారం పేరిట బురిడీ ● ఆశచూపించి రూ.లక్షల్