'విభజన వల్ల సమస్యలొస్తాయని ముందే చెప్పాం'
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల సమస్యలు వస్తాయని ముందే చెప్పామని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. విభజనతో ఇద్దరు సీఎంలు అయ్యారే తప్ప..ప్రజలు మేలు జరగడం లేదని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలు సమస్యల పాలయ్యారని రాఘవులు తెలిపారు. రాష్ట్రాల శ్రేయస్సు దృష్ట్యా.. నేతలు రాజకీయాలు మాని సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని విద్యుత్ సమస్యను పరిష్కరించాలని రాఘవులు విజ్క్షప్తి చేశారు. విద్యుత్ కేటాయింపులపై కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కాల రాస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పని దినాలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై ప్రజలను చైతన్య పరిచి ఆందోళన చేస్తామని రాఘవులు హెచ్చరించారు.