రాష్ట్ర విభజన బిల్లుపై సీపీఐ, బీజేపీలు ఎటువంటి సవరణలు కోరకుండా కేవలం సూచనలు, సలహాలతో సరిపెట్టగా సీపీఎం ఒక్క సవరణ కోరింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై సీపీఐ, బీజేపీలు ఎటువంటి సవరణలు కోరకుండా కేవలం సూచనలు, సలహాలతో సరిపెట్టగా సీపీఎం ఒక్క సవరణ కోరింది. సీపీఐ 32, బీజేపీ 15 సలహాలు అందజేశారుు. శుక్రవారం స్పీకర్ మనోహర్‌ను అసెంబ్లీలో విడివిడిగా కలిసిన ఆయూ పార్టీల ఎమ్మెల్యేలు అందజేశారు. దీనిపై ఈ రెండు పార్టీల సీమాంధ్ర నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయగా తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇక సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి స్పీకర్‌కు అందజేసిన లేఖలో ఏకైక సవరణను ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 అని ఉన్న చోట ‘ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి బిల్లు-2013’గా మార్చాలని సవరణ ప్రతిపాదించారు. అయితే దానిపై ఎలాంటి వివరణా ఇవ్వలేదు.
సీపీఐ చేసిన కొన్ని ముఖ్య సూచనలు..: తెలంగాణ శాసనసభలో సీట్ల సంఖ్యను 153కి పెంచాలి. ట కృష్ణాజలాల వివాదాల ట్రిబ్యునల్‌కు కొత్త చైర్మన్‌ను నియమించాలి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలి పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు చేపట్టాలి జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయాలి అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధానికి రూ.5 లక్షల కోట్లు కేటాయించాలి సీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక మండళ్లు ఏర్పాటు చేయాలి విజయవాడను ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మార్చాలి ఆధునాతన వైద్య సంస్థలను, కేంద్రప్రభుత్వ సంస్థలను సీమాంధ్రలోనూ ఏర్పాటు చేయాలి.
బీజేపీ సలహాలు..: శాంతిభద్రతల పర్యవేక్షణ అధికారాలు గవర్నర్‌కు ఇవ్వొద్దు ఏ ప్రాంతంపైనా భారం పడకుండా పెన్షన్ల వ్యవహారాన్ని పరిష్కరించాలి యూపీ, ఎంపీ, బీహార్ రాష్ట్రాల విభజన సమయంలో పాటించిన విధంగానే ఆస్తులు, అప్పుల పంపకాలు ప్రాణహిత-చేవెళ్లతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలి కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలి. తెలంగాణలో ఉన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ కేంద్రప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలి విద్యాసంస్థలకు సంబంధించిన ఉమ్మడి ప్రవేశ విధానాన్ని రెండేళ్లకే పరిమితం చేయాలి.