న్యూఢిల్లీ: కానుకలు, గ్రాంట్ల రూపంలో దేశంలోని ఐదు జాతీయ పార్టీలకు ఈ ఏడాది రూ. 1,257.79 కోట్ల ఆదాయం సమకూరిందని తాజా వివిరాలు వెల్లడించాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పార్టీల ఆదాయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం బీజేపీ గరిష్టంగా రూ. 970.43 కోట్లు కాగా(మొత్తం ఆదాయంలో 76 శాతం), సీపీఎం 123.92 కోట్లతో రెండో స్థానంలో ఉంది. బీఎస్పీ రూ. 111కోట్లు, ఎన్సీపీ, సీపీఐ 67.64కోట్లు, 1.84 కోట్ల ఆదాయాన్ని చూపించాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆడిట్ కాపీని సమర్పించలేదని ఏడీఆర్ తెలిపింది.