B.raghavulu
-
'విభజన వల్ల సమస్యలొస్తాయని ముందే చెప్పాం'
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల సమస్యలు వస్తాయని ముందే చెప్పామని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. విభజనతో ఇద్దరు సీఎంలు అయ్యారే తప్ప..ప్రజలు మేలు జరగడం లేదని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలు సమస్యల పాలయ్యారని రాఘవులు తెలిపారు. రాష్ట్రాల శ్రేయస్సు దృష్ట్యా.. నేతలు రాజకీయాలు మాని సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని విద్యుత్ సమస్యను పరిష్కరించాలని రాఘవులు విజ్క్షప్తి చేశారు. విద్యుత్ కేటాయింపులపై కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కాల రాస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పని దినాలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై ప్రజలను చైతన్య పరిచి ఆందోళన చేస్తామని రాఘవులు హెచ్చరించారు. -
'దేశాన్ని 60 రాష్ట్రాలుగా బీజేపీ విభజించాలనుకుంటోంది'
హైదరాబాద్:భారతీయ జనతాపార్టీ దేశాన్ని అరవై రాష్ట్ర్టాలుగా విభజించాలనుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బి. రాఘవులు విమర్శించారు. చిన్నరాష్ట్రాల ఏర్పాటుతో దేశం పురోగతి సాధిస్తుందని బీజేపీ గతంలో ప్రకటించిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి మీడియాతో మాట్లాడిన రాఘవులు.. బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. భారతదేశాన్ని అరవై రాష్ట్రాలుగా విభజించాలని బీజేపీ యోచిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన బస్సుయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఆయన స్పష్టమైన వైఖరి ప్రకటించించిన అనంతరం యాత్ర చేపడితే బాగుంటుందన్నారు.