హైదరాబాద్:భారతీయ జనతాపార్టీ దేశాన్ని అరవై రాష్ట్ర్టాలుగా విభజించాలనుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బి. రాఘవులు విమర్శించారు. చిన్నరాష్ట్రాల ఏర్పాటుతో దేశం పురోగతి సాధిస్తుందని బీజేపీ గతంలో ప్రకటించిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి మీడియాతో మాట్లాడిన రాఘవులు.. బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. భారతదేశాన్ని అరవై రాష్ట్రాలుగా విభజించాలని బీజేపీ యోచిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన బస్సుయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఆయన స్పష్టమైన వైఖరి ప్రకటించించిన అనంతరం యాత్ర చేపడితే బాగుంటుందన్నారు.