సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చిచ్చు ప్రభుత్వ శాఖల ఉన్నత ఉద్యోగుల్లోనూ అగ్గి రాజేస్తోంది. పని విభజనలో ఏకపక్ష వైఖరి కనిపిస్తుందంటూ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలకు వెళ్లిన ఉన్నతాధికారులు గగ్గోలు పెడుతున్నారు. నలుగురు అధికారులకు సమానంగా పంచాల్సిన బాధ్యతలు ఒక్కరికే కట్టబెట్టడంతో ఆర్‌డ బ్ల్యూఎస్(గ్రామీణ నీటిసరఫరా పథకం)లో ఒకింత అయోమయం నెలకొంది. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఉన్న మొత్తం ఏడుగురు చీఫ్ ఇంజనీర్‌లలో ఆరుగురు తెలంగాణకు చెందినవారు ఉండగా, జనాభా నిష్పత్తి మేరకు నలుగురు సీఈలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
వారిలో ముగ్గురు తెలంగాణకు చెందినవారే కావడంతో సమస్య మొదలైంది. ఆర్‌డబ్ల్యూఎస్‌లో తమకంటే ఎంతో జూనియర్ అయిన వ్యక్తి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడన్న కారణంతో శాఖ పరిపాలన(అడ్మినిస్ట్రేషన్)తో పాటు ప్రాజెక్ట్స్, ఎన్టీఆర్ సుజల స్రవంతి తదితర కీలక శాఖలన్నీ ఆయనకే అప్పగించారు. ఈ పరిణామం మిగిలిన ముగ్గురు సీఈలకు ఆగ్రహాన్ని కలిగించింది. తాము తమ ప్రాంతాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసేందుకు సిద్ధమై వెళ్లామని, అక్కడ సమన్యాయంతో చూడాల్సిన కొందరు పెద్దలు సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు సీఈల్లో ఒకరు మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
ఆర్‌డబ్ల్యూఎస్‌లో నాలుగు స్తంభాలాట
Published Sat, Jul 5 2014 2:39 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement