
‘బిల్లు’ను ఆమోదించేది ఇలాగేనా?
పార్లమెంట్‌లో ఏం జరిగింది-6
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన ఫిబ్రవరి 18, 2014న లోక్‌సభలో జరిగిన సన్నివేశాల కొనసాగింపును ఇప్పుడు చూద్దాం.
స్పీకర్:
ది క్వశ్చన్ ఈజ్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం తత్సంబంధిత ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకోవటం విషయమై...
ప్రతిపాదన ఆమోదించబడింది.
స్పీకర్: ఇప్పుడు సభ క్లాజుల వారీగా చేబడుతుంది.
ది క్వశ్చన్ ఈజ్:
క్లాజ్ 2 బిల్లులో భాగమవుతుంది.
ఆమోదించబడింది.
క్లాజ్ 2 బిల్లులో భాగమయ్యింది.
క్లాజ్ 3
షిండేగారి సవరణ ప్రతిపాదన: పేజి 2 లైన్ 29లో ఖమ్మం అనే చోట, (జీవో నం.111 ఇరిగే షన్ మరియు సీఏడీ, 27.6 2005లో ప్రస్తావించ బడిన రెవెన్యూ గ్రామాలు మరియూ బూర్గం పాడు, సీతానగరం, కొండ్రెక గ్రామాలు మిన హాయించి)
స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్
క్లాజ్ 3, సవరించిన విధంగా, బిల్లులో భాగం అవుతుంది.
ఆమోదించబడింది.
క్లాజ్ 3 సవరించిన విధంగా బిల్లులో భాగమ య్యింది.
ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలనుకుంటే మీ స్థానాలకు వెళ్లిపొండి.
... అంతరాయం...
స్పీకర్: మీ మీ సీట్లకు వెళ్లిపోండి. ‘వెల్’లో మీరేమన్నా పరిగణనలోకి తీసుకోబడదు.
ది క్వశ్చన్ ఈజ్
క్లాజ్ 4 బిల్లులో భాగమవుతుంది.
ఆమోదించబడింది.
క్లాజ్ 4 బిల్లులో భాగమయ్యింది.
... అంతరాయం...
టీఆర్‌బాలు ఒక రాష్ట్రం ఏర్పడే బిల్లు పాస్ చేయాల్సిన పద్ధతి ఇది కాదు. ఫెడరల్ వ్యవస్థకు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి విరుద్ధమిది! నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం.
13.24: బాలు మరికొందరు సభ్యులూ సభ వదిలి వెళ్లిపోయారు.
క్లాజ్ 5
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని.
స్పీకర్: సౌగత్‌రాయ్ గారూ 39, 40 సవర ణలు ప్రతిపాదిస్తున్నారా.
సౌగత్‌రాయ్: పేజీ 2, లైన్ 37లో
‘‘పదేళ్లకు మించకుండా’’ బదులుగా
‘‘ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని రెడీ అయ్యే వరకూ’’ (39వ సవరణ)
పేజీ 2 లైన్ 38లో
‘‘సబ్ సెక్షన్‌లో ప్రస్తావించిన కాల పరిమితి తీరే వరకూ’’ బదులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని రెడీ అయ్యేవరకూ’’ (40వ సవరణ)
స్పీకర్: క్లాజ్ 5కు సౌగత్‌రాయ్ ప్రతిపాదిం చిన 39, 40 సవరణలు సభ ముందు ‘ఓటింగ్’ పెడుతున్నా...
సౌగత్‌రాయ్: మేడమ్ ‘డివిజన్’ కావాలి.
స్పీకర్: గౌరవ సభ్యులారా, నా ఉద్దేశంలో, డివిజన్ అనవసరంగా అడుగుతున్నారు. రూల్ 367 సబ్ రూల్ (3) అనుబంధం (ప్రోవిజో) ప్రకా రం ‘ఆయ్’ అనుకూలురు, ‘నో’ వ్యతిరేకులూ తమ తమ స్థానాల్లో నిలబడితే లెక్క పెట్టించి, సభ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. తమ స్థానాల్లో లేని సభ్యులను లెక్కలోకి తీసుకోం.
‘ఆయ్’ అన్న వారందరూ తమ స్థానాల్లో నిల బడండి. అవును ఆయ్ అందరూ నిలబడండి.
ప్రొ॥సౌగత్‌రాయ్: మేడమ్ నేను ‘డివిజన్’ అడుగుతున్నా
స్పీకర్: అవును డివిజన్ కోసమే నేను లెక్క పెట్టమంటున్నా.
ప్రొ॥సౌగత్‌రాయ్: మేడమ్ నేను ‘డివిజన్’ అడుగుతున్నా, ఏ రూల్ ప్రకారం మీరు డివిజన్ నిరాకరించగలరు? నేను డివిజన్ అడుగుతున్నా.
స్పీకర్: గౌరవ సభ్యులారా మీమీ స్థానాల్లో ఉంటేనే లెక్కలోకి వస్తారు. మళ్లీ చెప్తున్నా మీ స్థానంలో ఉంటేనే లెక్క... మీ స్థానాల్లోకి వెళ్లండి.
... అంతరాయం...
స్పీకర్: ‘నో’ అనేవాళ్లు మీమీ స్థానాల్లో నిలబడండి.
... అంతరాయం...
స్పీకర్: గౌరవ సభ్యులారా... ‘నో’ ‘ఆయ్’ కన్నా ఎక్కువున్నాయి. ‘ఆయ్’ 29 ‘నో’ 230 సవ రణ వీగిపోయింది.
స్పీకర్: అసదుద్దీన్ ఒవైసీ మీ 44వ సవరణ ప్రతిపాదిస్తున్నారా...
అసదుద్దీన్ ఒవైసీ: ‘ఎప్పా యింటెడ్’ రోజు నుంచి, రెండేళ్ల కాలం మించకుండా ఖైరతాబాద్ రెవెన్యూ మండల ప్రాంతం మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధానిగాను హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానిగానూ - 35 నుండి 43 లైన్లు, 2వ పేజీలో మార్చవల్సిందిగా కాలపరిమితి ముగిసిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పర్చాలనీ సవరణ ప్రతిపాది స్తున్నాను.
నాకొక్క ముప్పై సెకన్లు సమయమిస్తే, ఈ సవరణ వివరిస్తాను. మేడమ్ ఒక రాష్ట్ర రాజధాని మరో రాష్ట్రంలో ఏర్పరచిన సంఘటన దేశంలో ఎక్కడా లేదు. రాజ్యాంగ విరుద్ధమైన ఇబ్బందికరమైన ప్రయోగం చేస్తోందీ ప్రభుత్వం మేడమ్, హైదరాబాద్ తెలంగాణలో భాగం. ఆంధ్రప్రదేశ్ రాజధానిని మీరు హైదరాబాద్‌లో అదీ జీహెచ్‌ఎంసీ ఏరియాలో ఏర్పాటు చేస్తు న్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆత్మ గౌర వం ఏమయిపోయింది. ఈ ప్రయోగానికి ఎలా ఒప్పుకుంటున్నారు. హైదరాబాద్ ఎప్పటికీ నాశన మైపోతుంది. నేను డివిజన్ కోరతాను మేడమ్!
... అంతరాయం...
స్పీకర్: అసదుద్దీన్ ఒవైసీ సవరణ సభ ఓటు కోసం మీ ముందు పెడ్తున్నాను.
ఒవైసీ: మేడమ్ ‘డివిజన్’ అడుగుతున్నాను.
స్పీకర్: గౌరవ సభ్యులారా డివిజన్ అనవస రంగా కోరుతున్నారని నేను భావిస్తున్నాను. 367(3) అనుబంధం కింద ‘ఆయ్’ మెంబర్లం దరూ తర్వాత ‘నో’ మెంబర్లందరూ నిలబడితే, లెక్కపెట్టి సభా నిర్ణయం ప్రకటిస్తాను.
స్పీకర్: ‘ఆయ్’ అనే మెంబర్లు లేచి నిల బడండి. ఆల్ రైట్
... అంతరాయం...
స్పీకర్: ‘నో’ అనే మెంబర్లు 235
సవరణ వీగిపోయింది.
ది క్వశ్చన్ ఈజ్: క్లాజు 5 బిల్లులో భాగమ య్యింది.
ప్రతిపాదన ఆమోదించబడింది.
క్లాజ్-6 (రాజధాని విషయమై నిపుణుల కమిటీ ఏర్పాటు గురించి)
స్పీకర్: షిండేగారి సవరణ 3వ పేజీ, 3వ లైన్
‘45 రోజులు’ బదులుగా ‘ఆరు నెలలు’
ది క్వశ్చన్ ఈజ్: సవరించబడిన విధంగా 6వ క్లాజు బిల్లులో భాగమయ్యింది.
క్లాజ్-7 (ఉన్న గవర్నర్ ఉమ్మడి గవర్నర్ గా...)
ప్రొ॥సౌగత్‌రాయ్: 3వ పేజీ 7వ లైన్ ‘‘ప్రెసి డెంట్ నిర్ధారించే సమయ పరిమితికి లోబడి’’ బదులుగా ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకూ’’ అని మార్చవల్సిందిగా సవరణ ప్రతిపాదిస్తున్నాను.
ఈ సవరణ ప్రతిపాదన చేస్తూనే, మీరు తలలు లెక్కపెట్టే పద్ధతిని నిరసిస్తున్నాను. మేం గొర్రెలం కాము. మా ముందు ఒక మీట (బటన్) ఉంది. మేము సవరణల మీద ‘డివిజన్’ కోరుచు న్నాము. ఇలా కాదు వ్యవహరించవలసిన తీరు.. మమ్మల్ని నిలబెట్టి తలలు లెక్క పెట్టడానికి మేము గొర్రెలం కాము. మీరు ఇదే తప్పుడు పద్ధతిలో ఈ బిల్లు ప్రవేశ పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఇలాగ అవు తోంది. దయచేసి రాజ్యాంగ బద్ధంగా బిల్లు పాస్ చేయండి. నేను ‘డివిజన్’ కోరుచున్నాను. తలల లెక్కకాదు. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వ్యవహరిం చిన తప్పుడు పద్ధతిలోనే ఇప్పుడూ వ్యవహరిస్తు న్నారు. ఈ సభలో ఇలా జరగకూడదు. చాలా తప్పుడు పద్ధతి నొకదానిని భావితరాలకు దృష్టాం తంగా ఏర్పాటు చేస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ విభజననే వ్యతిరేకిస్తున్నాం. భాషాప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతాన్ని భంగపరిచే ఏ రాష్ట్ర విభ జననైనా మేం వ్యతిరేకిస్తాం.
స్పీకర్: ఈ సవరణపై ఓటింగ్ వరకు ఏ అతిక్రమణా జరగలేదు.
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
ఉండవల్లి అరుణ్‌కుమార్, a_vundavalli@yahoo.com