ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా తేల్చి చెప్పినందుకు, ఆయన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినందుకు నిరసనగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర బంద్ పాటించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.