న్యాయాధికారుల వివాదంపై కేంద్రానికి కేసీఆర్‌ లేఖ | Kcr writes letters to central govt on dispute of judicial officers issue | Sakshi
Sakshi News home page

న్యాయాధికారుల వివాదంపై కేంద్రానికి కేసీఆర్‌ లేఖ

Published Tue, Jun 28 2016 9:37 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

న్యాయాధికారుల వివాదంపై కేంద్రానికి కేసీఆర్‌ లేఖ - Sakshi

న్యాయాధికారుల వివాదంపై కేంద్రానికి కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌: హైకోర్టు విభజన జరగనంత వరకు రాష్ట్ర విభజన పూర్తి కానట్టేనని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. న్యాయాధికారుల వివాదంపై మంగళవారం ఆయన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జితేంద్రసింగ్‌లకు లేఖలు రాశారు.  కేంద్రం వెంటనే హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు విభజన పూర్తైన తర్వాతే న్యాయాధికారుల కేటాయింపు ప్రక్రియ మొదలుకావాలని కోరారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు.

ప్రస్తుతం జరిగిన న్యాయాధికారుల కేటాయింపు వివాదానికి దారి తీసిందనీ, న్యాయాధికారుల కేటాయింపు ఇలానే ఉంటే తెలంగాణ న్యాయాధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ విభజన సమయంలో హైకోర్టు విభజనలు జరిగిన తర్వాతే జడ్జీల నియమకాలు జరిగాయని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement