నిధుల బదలాయింపు చేయవద్దు: రాజీవ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి నిధులను బదలాయింపు చేయవద్దని బ్యాంకర్లకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో విభజన, నిధుల బదలాయింపు, తదితర అంశాలపై రాజీవ్ శర్మ చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా పదవ షెడ్యూల్ లోని సంస్థల బ్యాంక్ ల లావాదేవీలను నిర్వహించవద్దని ఆయన తెలిపారు. విభజనకు సంబంధించిన సంస్థలపై మూడు రోజుల్లో ఓ నివేదిక ఇస్తామని రాజీవ్ శర్మ తెలిపారు.