చెత్తబుట్టలో వేయడం... ఫ్యాషనైపోయింది | Story on Govt appointment committees on various issues | Sakshi
Sakshi News home page

చెత్తబుట్టలో వేయడం... ఫ్యాషనైపోయింది

Published Tue, Sep 2 2014 12:37 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

చెత్తబుట్టలో వేయడం... ఫ్యాషనైపోయింది - Sakshi

చెత్తబుట్టలో వేయడం... ఫ్యాషనైపోయింది

ప్రజల నుంచి ఆందోళనలు ఎదురైనా... తనకు ఏ సమస్య వచ్చిన ప్రభుత్వానికి వెంటనే గుర్తుకు వచ్చేది 'కమిటీ' ...  అది ఏ సమస్య అయినా... రాష్ట్ర విభజన, రాష్ట్ర రాజధాని ఎంపిక, మహిళలపై అత్యాచారాలు.... అన్నింటీకి ఒకటే మందు కమిటీ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ప్రజలు పోరాటం చేస్తుంటే వారికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడంతో పాటు ఆ సమస్య నుంచి బయటపడటానికి 'కమిటీ' కల్లోలంలో ఉన్న ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే ఓ చుక్కాని . అలా వచ్చినవే రాష్ట్ర విజభనపై ఏర్పాటైన జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ,  ఏపీ నూతన రాజధాని ఎంపికపై ఏర్పాటైన ప్రొ. శివరామకృష్ణన్ కమిటీ.

విభజన నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహాంతో ఉగిపోతుంటే... ఆ సమస్య నుంచి గట్టేక్కడానికి కేంద్రం ప్రొ.శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి నిర్దిష్ట కాలపరిమితిని విధిస్తుంది... ఎందుకంటే ఆ కాలపరిమితి వరకు ప్రజలు శాంతంగా ఉంటారని. నిర్ణీత కాలవ్యవధిలో ఆ కమిటీ తన నివేదికను ప్రభుత్వం అందజేస్తుంది. కానీ ఆ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా బుట్టదాఖలు చేస్తుంది. గతంలో ఇలాగే జరిగింది. ఇప్పుడూ అలాగే...

ఏపీ నూతన రాజధాని ఎంపిక చేసి ఆగస్టు 31నాటికి నివేదిక అందజేయాలని ప్రొ.శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ నివేదికలో పలు కీలక అంశాలు నిర్దేశిస్తూ ఆ కమిటీ కేంద్రానికి నివేదిక అందజేసింది. ఆ కమిటీలోని ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా... రాజధాని ఎంపిక తమ ఇష్టం వచ్చిన చోట నిర్ణయిస్తామంటూ టీడీపీ ప్రభుత్వం వ్యవహారిస్తుంది. కమిటీలను ఏర్పాటు చేయడం... ఆ కమిటీ నివేదికలను పట్టించుకోకుండా... తాము అనుకున్నదే జరగాలి అని తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా ప్రభుత్వాలు వ్యవహారిస్తున్నాయి.

ప్రభుత్వాలు ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తుంటే ఆ కమిటీల పేరుతో ప్రజలను వంచించి.. వారి సొమ్మును దుర్వినియోగం చేయడం ఎంత వరకు సబబు అని ప్రజలు అడుగుతున్నారు. వివిధ సమస్యలపేరుతో కమిటీలు ఏర్పాటు చేసి... ఆ నివేదికలు అందిన  వెంటనే బుట్టలో పడేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫ్యాషనైపోయిందని వారు విమర్శిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement