సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ మేనిఫెస్టోను తయారు చేసే బాధ్యతను మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగించింది. శ్రీధర్‌బాబు చైర్మన్‌గా మరో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ వైస్‌చైర్మన్‌గా 24 మంది సభ్యులతో తెలంగాణ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
మేనిఫెస్టో కమిటీ సహా 107 మందితో మొత్తం 8 కమిటీలను ఏఐసీసీ నియమించింది. ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు, పబ్లిసిటీ, చార్జిషీట్, కమ్యూనికేషన్స్, ట్రైనింగ్, స్ట్రాటజీ కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని వర్గాల నేతలకు ఈ కమిటీల్లో స్థానం కల్పించింది. మేనిఫెస్టో కమిటీతోపాటు చార్జిషీట్ కమిటీకి ఎక్స్‌అఫీషియో సభ్యులను కూడా నియమించింది. టీపీసీసీ కమిటీల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు శిక్షణ కమిటీ బాధ్యతను అప్పగించింది.
ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన టీపీసీసీ కమిటీలు...
1. ఎన్నికల నిర్వహణ కమిటీ: దామోదర రాజనర్సింహ (చైర్మన్), వంశీచందర్‌రెడ్డి, ఈర్ల కొమురయ్య, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నమిండ్ల శ్రీనివాస్, జగన్‌లాల్ నాయక్, సుప్రభాత్‌రావు, భరత్‌చౌహాన్, ఫక్రుద్దీన్.
2. మేనిఫెస్టో కమిటీ: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (చైర్మన్), గడ్డం ప్రసాద్ (వైస్ చైర్మన్), దామోదర, పొన్నాల, బలరాం నాయక్, ఆర్. దామోదర్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంభాని చంద్రశేఖర్, పోట్ల నాగేశ్వరరావు, ఎం. రమేశ్‌ముదిరాజ్, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్‌బీన్‌హందాన్, ఎర్ర శేఖర్, జి. నాగయ్య, గండ్రత్ సుజాత్, రవళిరెడ్డి, కత్తి వెంకటస్వామి, మర్రి ఆదిత్యరెడ్డి, ప్రొఫెసర్ జానయ్య, దీపక్‌జాన్, మేడిపల్లి సత్యం, చందా లింగయ్య, మువ్వా విజయ్‌బాబు, చామల శ్రీనివాస్. (ఈ కమిటీకి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, అనుబంధ సంఘాల చైర్మన్‌లను నియమించారు.)
3. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ: బలరాం నాయక్ (చైర్మన్), ఎన్. పద్మావతిరెడ్డి, నేరెళ్ల శారద, రాపోలు జయప్రకాశ్, వేంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, కె. కృష్ణారెడ్డి, కె. తిరుపతి, సయ్యద్ నిజాముద్దీన్.
4. పబ్లిసిటీ కమిటీ: షబ్బీర్ అలీ (చైర్మన్), ఈరవత్రి అనిల్ (వైస్‌చైర్మన్), గడ్డం వినోద్, సురేశ్ షేట్కార్, గాలి అనిల్‌కుమార్, కుమార్‌రావు, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, గడుగు గంగాధర్, మన్నె సతీశ్, నాయుడు సత్యనారాయణ గౌడ్, వచన్‌కుమార్, మధుసూదన్‌గుప్తా.
5. చార్జిషీట్ కమిటీ: సంపత్‌కుమార్ (చైర్మన్), రాములు నాయక్ (వైస్ చైర్మన్), సిరిసిల్ల రాజయ్య, కోదండరెడ్డి, గంగారాం, బెల్లయ్య నాయక్, జ్యోత్స్న రెడ్డి, ఉజ్మా షాకీర్, నాగరిగారి ప్రీతం, నూతి శ్రీకాంత్ గౌడ్, షేక్ సోహైల్, మెట్టు సాయికుమార్, అన్వేశ్‌రెడ్డి, సిరాజ్ అమీన్ ఖాన్. ( ఈ కమిటీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పార్టీ అధికార ప్రతినిధులను నియమించారు.)
6. కమ్యూనికేషన్స్ కమిటీ: జెట్టి కుసుమకుమార్ (చైర్మన్), మదన్‌మోహన్‌రావు (వైస్‌చైర్మన్), ఎం.ఎ.ఫహీమ్, అనిరుద్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, జైపాల్ వడ్డెర, అవెజొద్దీన్, గాలి బాలాజీ, కొప్పుల ప్రవీణ్.
7. ట్రైనింగ్ కమిటీ: పొన్నం ప్రభాకర్ (చైర్మన్), పవన్ మల్లాది (కన్వినర్), గోపిశెట్టి నిరంజన్, సయ్యద్ అజ్మతుల్లా, కోట నీలిమ, పూజల హరికృష్ణ, డాక్టర్. రవిబాబు, ఎం. లింగాజి, కోల్కొండ సంతోశ్, శ్రవణ్‌రావు, ఊట్ల వరప్రసాద్, వెంకటరమణ, మమతానాగిరెడ్డి, సాగరికారావు, రిషికేశ్‌రెడ్డి, కొత్త సీతారాములు, ఎం.ఎ.బాసిత్.
8. స్ట్రాటజీ కమిటీ: కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు (చైర్మన్), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, జంగయ్య యాదవ్, సింగాపురం ఇందిర, నరేశ్ జాదవ్, పాల్వాయి స్రవంతి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్, ఆడం సంతోశ్, ఆమీర్‌జావెద్, జి.వి.రామకృష్ణ, లోకేశ్ యాదవ్, రాములు యాదవ్.
Comments
Please login to add a commentAdd a comment