committees
-
స్థానిక సమరానికి సై
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ‘లోకల్ బాడీ’ఎలక్షన్స్ టార్గెట్‌గా పెట్టుకుంది, గ్రామస్థాయిలో సంస్థాగతంగా బలపడేందుకు కమలదళం సన్నద్ధమవుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్ని కల నాటికి గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల వ్యవస్థ పటిష్టానికి అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలు నిరాశ పరిచినా, లోక్‌సభ ఫలితాలు బీజేపీకి కొంతమేర ఊపునిచ్చాయి. గ్రామస్థాయిలో బీజేపీ అంత పటిష్టంగా లేదు. ఈసారి జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. శుక్రవారం జరిగిన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలోనూ 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరాలని.. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ తీర్మానించింది, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటింగ్ రాగా, లోక్‌సభ ఎన్నికల నాటికి 35 శాతానికి ఓటింగ్ పెరిగింది. త్వరలో జరగబోయే లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈ ఓటింగ్‌ను నిలుపుకునేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కేంద్రమంత్రులు, ముఖ్యనేతలు, ఎంపీలు స్థానిక ఎన్నికల్లో అన్నిస్థాయిల్లోని పార్టీ కేడర్‌కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇంతకాలం ఎంపీలు, ఎమ్మెల్యేల విజయానికి కృషి చేసిన కార్యకర్తలను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ప్రకటించారు. స్థానికం.. సన్నద్ధం: పార్టీపరంగా స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన కార్యాచరణ, వ్యూహాలు సిద్ధం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ప్రత్యేకంగా 32 జిల్లాస్థాయి, మండలాల నుంచి, గ్రామ పంచాయతీల దాకా స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు సామాజిక సమతూకం పాటిస్తూ.. ఓ ఓసీ, ఓ ఎస్సీ, ఓ బీసీ, ఓ మహిళ ఉండేలా కమిటీల కూర్పు ఉండనుంది. ఈ కమిటీలన్ని జిల్లా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ వరకు పర్యటించి వార్డుసభ్యులు మొదలు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులను గుర్తిస్తారు. పోటీచేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు కూడా ఈ కమిటీలకే అప్పగించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. -
అసంతృప్తులకు కమిటీల కొలువులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యనేతలతోపాటు అసంతృప్త నేతలకు కీలక కమిటీల్లో చోటు కల్పిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 14 కమి టీలకు చైర్మన్లు, కన్వీనర్లు, కో–కన్వీనర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నియమించారు. అసంతృప్తవాదులకు బుజ్జగింపు... పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు దక్క డం లేదని, ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కార్ పై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయనాయకత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదంటూ కొంతకాలంగా కొందరు జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ తగిన విధంగా వ్యవహ రించకపోతే, బీఆర్ఎస్ను ఓడించగలిగే పార్టీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమేనంటూ కూడా వారిలో కొందరు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితు ల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దానిపై, ఇతర అంశాలపై చర్చకు జాతీయ కార్యవర్గ సభ్యు లు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వ ర్‌రెడ్డి, ఎం.రవీంద్ర నాయక్, జి.విజయరామా రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదిత రులు ఇటీవల కాలంలో పలుమార్లు భేటీ అయ్యా రు. వారిలో కొందరు త్వరలోనే బీజేపీని వీడతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ప్రధాని మోదీ మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో నిర్వ హించిన బహిరంగ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతోపాటు కేసీఆర్ సర్కార్, బీఆర్ ఎస్ తీరును తీవ్రంగా ఎండగట్టడం వంటి పరిణా మాలతో వారి వైఖరిలో మార్పు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా వివిధ కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికలుండగా ఆందోళనల కమిటీకి చైర్మన్‌గా విజయశాంతిని నియ మించడం గమనార్హం. అదేవిధంగా వివిధ కమిటీ ల్లో వివేక్ వెంకట స్వామి, రాజ్‌గోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రవీంద్రనాయక్, విజయరామారా వులకు ప్రాతినిధ్యం కల్పించారు. వారితోపాటు ముఖ్యనేతలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, మురళీశర్రావు, మర్రి శశిధర్‌రెడ్డి. పొంగులేటి సుధాకరరెడ్డిలకు కూడా అవకాశం కల్పించారు. కాగా, తనతోపాటు ఇతర ముఖ్య నేతలెవరూ బీజేపీని వీడట్లేదని రాజ గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కమిటీలు ఇలా... సోషల్ అవుట్‌రీచ్ కమిటీ: చైర్మన్‌గా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, కన్వీనర్‌గా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పబ్లిక్ మీటింగ్ కమిటీ: చైర్మన్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, కన్వీనర్‌గా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్ ప్రజలను ప్రభావితం చేసే వారికి చేరువయ్యే కమిటీ: చైర్మన్‌గా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కన్వీనర్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డి మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ: చైర్మన్‌గా జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్, కన్వీనర్‌గా మా జీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. చార్జిషీట్ కమిటీ: చైర్మన్‌గా పార్టీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి పి.మురళీధర్‌రావు, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జాయింట్ కన్వీనర్‌గా చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ రామచంద్రుడు స్క్రీనింగ్ కమిటీ: చైర్మన్‌గా జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, కన్వీనర్‌గా దుగ్యాల ప్రదీప్‌కుమార్ ఆందోళనల కమిటీ: చైర్మన్‌గా విజయశాంతి, కన్వీనర్‌గా డా.జి.మనోహర్‌రెడ్డి సోషల్ మీడియా కమిటీ: చైర్మన్‌గా ఎంపీ అర్వింద్, కన్వీనర్‌గా పోరెడ్డి కిషోర్‌రెడ్డి ఎన్నికల కమిషన్ అంశాల కమిటీ: చైర్మన్‌గా మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ ప్రధాన కార్యాలయ సమన్వయ కమిటీ: చైర్మన్‌గా జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, కన్వీనర్‌గా బంగారు శ్రుతి మీడియా కమిటీ: చైర్మన్‌గా ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు, జాయింట్ కన్వీనర్‌గా డా.ఎస్. ప్రకాష్‌రెడ్డి క్యాంపెయిన్ ఇష్యూస్/టాకింగ్ పాయింట్స్ కమిటీ: చైర్మన్‌గా వెదిరె శ్రీరామ్, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ: చైర్మన్‌గా జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, కన్వీనర్‌గా మాజీ మంత్రి జి.విజయరామారావు ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ: చైర్మన్‌గా జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, కన్వీనర్‌గా ఎంపీ సోయం బాపూరావు, జాయింట్ కన్వీనర్‌గా ఎం. రవీంద్రనాయక్ నియమితులయ్యారు. -
సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఆరు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 16, 17 తేదీల్లో హైదరా బాద్ వేదికగా జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నిర్వహణ కోసం టీపీసీసీ ఆరు కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు 39 మంది ముఖ్య నేతలతో రిసెప్షన్ కమిటీని నియమించింది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు దామోదర రాజనర్సింహ, వంశీచందర్‌రెడ్డిలతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ కమిటీలో చోటు కల్పించింది. మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్‌గా ఏడుగురితో సోషల్ మీడియా కమిటీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ చైర్మన్‌గా ఏడుగురితో ట్రాన్స్‌పోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఖమ్మం మాజీ ఎంపీ, టీపీపీసీ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి చైర్మన్‌గా, గాలి అనిల్‌కుమార్ కోచైర్మన్‌గా పబ్లిసిటీ అండ్ బ్రాండింగ్ కమిటీ, అజారుద్దీన్ చైర్మన్‌గా జీహెచ్ఎంసీ పబ్లిసిటీ కమిటీ, టీపీసీసీ ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్ రావు చైర్మన్‌గా ప్రొటోకాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 29 మందిని సభ్యులుగా నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ చదవండి: గుడుంబా పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చింది: ఈటల -
శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ మేనిఫెస్టోను తయారు చేసే బాధ్యతను మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగించింది. శ్రీధర్‌బాబు చైర్మన్‌గా మరో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ వైస్‌చైర్మన్‌గా 24 మంది సభ్యులతో తెలంగాణ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేనిఫెస్టో కమిటీ సహా 107 మందితో మొత్తం 8 కమిటీలను ఏఐసీసీ నియమించింది. ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు, పబ్లిసిటీ, చార్జిషీట్, కమ్యూనికేషన్స్, ట్రైనింగ్, స్ట్రాటజీ కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని వర్గాల నేతలకు ఈ కమిటీల్లో స్థానం కల్పించింది. మేనిఫెస్టో కమిటీతోపాటు చార్జిషీట్ కమిటీకి ఎక్స్అఫీషియో సభ్యులను కూడా నియమించింది. టీపీసీసీ కమిటీల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు శిక్షణ కమిటీ బాధ్యతను అప్పగించింది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన టీపీసీసీ కమిటీలు... 1. ఎన్నికల నిర్వహణ కమిటీ: దామోదర రాజనర్సింహ (చైర్మన్), వంశీచందర్‌రెడ్డి, ఈర్ల కొమురయ్య, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నమిండ్ల శ్రీనివాస్, జగన్‌లాల్ నాయక్, సుప్రభాత్రావు, భరత్‌చౌహాన్, ఫక్రుద్దీన్. 2. మేనిఫెస్టో కమిటీ: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (చైర్మన్), గడ్డం ప్రసాద్ (వైస్ చైర్మన్), దామోదర, పొన్నాల, బలరాం నాయక్, ఆర్. దామోదర్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంభాని చంద్రశేఖర్, పోట్ల నాగేశ్వరరావు, ఎం. రమేశ్‌ముదిరాజ్, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్బీన్హందాన్, ఎర్ర శేఖర్, జి. నాగయ్య, గండ్రత్ సుజాత్, రవళిరెడ్డి, కత్తి వెంకటస్వామి, మర్రి ఆదిత్యరెడ్డి, ప్రొఫెసర్ జానయ్య, దీపక్‌జాన్, మేడిపల్లి సత్యం, చందా లింగయ్య, మువ్వా విజయ్‌బాబు, చామల శ్రీనివాస్. (ఈ కమిటీకి ఎక్స్అఫీషియో సభ్యులుగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, అనుబంధ సంఘాల చైర్మన్లను నియమించారు.) 3. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ: బలరాం నాయక్ (చైర్మన్), ఎన్. పద్మావతిరెడ్డి, నేరెళ్ల శారద, రాపోలు జయప్రకాశ్, వేంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, కె. కృష్ణారెడ్డి, కె. తిరుపతి, సయ్యద్ నిజాముద్దీన్. 4. పబ్లిసిటీ కమిటీ: షబ్బీర్ అలీ (చైర్మన్), ఈరవత్రి అనిల్ (వైస్‌చైర్మన్), గడ్డం వినోద్, సురేశ్ షేట్కార్, గాలి అనిల్‌కుమార్, కుమార్‌రావు, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, గడుగు గంగాధర్, మన్నె సతీశ్, నాయుడు సత్యనారాయణ గౌడ్, వచన్‌కుమార్, మధుసూదన్‌గుప్తా. 5. చార్జిషీట్ కమిటీ: సంపత్‌కుమార్ (చైర్మన్), రాములు నాయక్ (వైస్ చైర్మన్), సిరిసిల్ల రాజయ్య, కోదండరెడ్డి, గంగారాం, బెల్లయ్య నాయక్, జ్యోత్స్న రెడ్డి, ఉజ్మా షాకీర్, నాగరిగారి ప్రీతం, నూతి శ్రీకాంత్ గౌడ్, షేక్ సోహైల్, మెట్టు సాయికుమార్, అన్వేశ్‌రెడ్డి, సిరాజ్ అమీన్ ఖాన్. ( ఈ కమిటీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పార్టీ అధికార ప్రతినిధులను నియమించారు.) 6. కమ్యూనికేషన్స్ కమిటీ: జెట్టి కుసుమకుమార్ (చైర్మన్), మదన్మోహన్రావు (వైస్‌చైర్మన్), ఎం.ఎ.ఫహీమ్, అనిరుద్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, జైపాల్ వడ్డెర, అవెజొద్దీన్, గాలి బాలాజీ, కొప్పుల ప్రవీణ్. 7. ట్రైనింగ్ కమిటీ: పొన్నం ప్రభాకర్ (చైర్మన్), పవన్ మల్లాది (కన్వినర్), గోపిశెట్టి నిరంజన్, సయ్యద్ అజ్మతుల్లా, కోట నీలిమ, పూజల హరికృష్ణ, డాక్టర్. రవిబాబు, ఎం. లింగాజి, కోల్కొండ సంతోశ్, శ్రవణ్‌రావు, ఊట్ల వరప్రసాద్, వెంకటరమణ, మమతానాగిరెడ్డి, సాగరికారావు, రిషికేశ్‌రెడ్డి, కొత్త సీతారాములు, ఎం.ఎ.బాసిత్. 8. స్ట్రాటజీ కమిటీ: కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు (చైర్మన్), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, జంగయ్య యాదవ్, సింగాపురం ఇందిర, నరేశ్ జాదవ్, పాల్వాయి స్రవంతి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్, ఆడం సంతోశ్, ఆమీర్జావెద్, జి.వి.రామకృష్ణ, లోకేశ్ యాదవ్, రాములు యాదవ్. -
ఎంపీల చేతికి ‘పవర్’!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ కోసం స్థానిక ఎంపీ నేతృత్వంలో జిల్లా స్థాయి విద్యుత్ కమిటీలను ఏర్పాటు చేయా లని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో అత్యంత సీనియర్ ఎంపీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కో–చైర్మన్లుగా జిల్లా లోని ఇతర ఎంపీలు, సభ్యకార్యదర్శులుగా జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, సభ్యులుగా జడ్పీచైర్మన్, ఎమ్మెల్యేలను నియమించాలని సూచించింది. కనీసం 3 నెలలకోసారి ఈ కమిటీ సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు కేంద్రం అప్పగించింది. విద్యుత్ రంగంలో కేంద్ర సంస్కరణలు, పథకాల అమలు తీరుపై ఈ కమిటీ సమీక్ష జరుపుతుంది. ఈ కమిటీ ఏర్పాటుతో జిల్లా స్థాయిలో సీనియర్ ఎంపీలు ‘పవర్ ఫుల్’గా మారనున్నారు. కేంద్ర పథకాల అమలు, శాఖ పనితీరు, రైతులు, వినియోగదారుల సమస్యలు వంటి అంశాలపై జిల్లా విద్యుత్ అధికారులు ఈ కమిటీకి నిత్యం సమాధానం ఇచ్చుకునే పరిస్థితి రానుంది. కొత్త సంస్కరణల అమలుకే.. దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం ఇటీవల కేంద్రం రూ.3 లక్షల కోట్లతో కొత్త పథకాన్ని ప్రకటించింది. జిల్లా స్థాయిలో ఈ పథకం అమలుపై నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఎంపీల నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద నిర్ధేశించిన సంస్కరణలను అమలు చేస్తేనే డిస్కంలకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందనుంది. ప్రధానంగా నష్టాలను తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలతో డిస్కంలు ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కేంద్రం నుంచి ఈ పథకం కింద నిధులు రానున్నాయి. దేశ వ్యాప్తంగా 25 కోట్ల స్మార్ట్ మీటర్లను బిగించడానికి కేంద్రం ఈ పథకం కింద తన వాటాగా రూ.22,500 కోట్లు కేటాయించింది. ఇతర సంస్కరణల అమలుకు రానున్న ఐదేళ్లలో కేంద్ర వాటాగా రూ.97,631 కోట్లను డిస్కంలకు అందజేయనుంది. ఈ పథకంతో పాటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం, కుసుమ్ వంటి కేంద్ర పథకాల అమలును ఈ కమిటీ పర్యవేక్షించనుంది. -
బూత్ కమిటీలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగింపుకొస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు బూత్‌కమిటీలపై దృష్టి పెట్టాయి. పోలింగ్‌కు ముందు రెండ్రోజులు, పోలింగ్ రోజున వీరి పాత్ర క్రియాశీలకం కానున్న నేపథ్యంలో బూతు కమిటీలకు కావాల్సిన సరంజామా సర్దే పనిలో పడ్డాయి. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీలతో పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీఎంలలో అభ్యర్థుల నంబరింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో డమ్మీ ఈవీఎంలతో వారికి అవగాహన కల్పిస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా, ప్రతి ఇంటికీ ఓటరు స్లిప్పులు పంచడం, వారి నుంచి ఓటు హామీ పొందడం, తటస్థులను మచ్చిక చేసుకోవడం లక్ష్యంగా బూత్ కమిటీలను పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. ఓటింగ్ శాతం పెంచడం, వృద్ధ, దివ్యాంగ ఓటర్లను బూత్‌లకు తీసుకొచ్చేందుకు పార్టీలన్నీ బూత్ కమిటీలపై ఆధారపడుతున్నాయి. ఇన్‌చార్జీలకు ప్రత్యేక శిక్షణ పోలింగ్ రోజు, అంతకు ముందు రోజు ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు వీరే కీలకం కావడంతో బూత్ కమిటీల ఇన్‌చార్జీలకు పార్టీలు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. పార్టీ ప్రచారాస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కరపత్రాలు పంచడం, నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతలన్నీ కమిటీలకే అప్పగించాయి. పార్టీల అసెంబ్లీ ఇన్చార్జీల సూచనల మేరకు బూత్కమిటీలను ఎంపిక చేసి, పార్టీకి ఓట్ల శాతం పెంచే యత్నాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కో బూత్ పరిధిలో 10 మంది ముఖ్య పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించడంతో పాటు ఓటర్లతో సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. -
డిగ్రీ–ఇంజనీరింగ్ ప్రవేశాల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ–ఇంజనీరింగ్ ప్రవేశాలను ఆన్లైన్లో అనుసంధానం చేయాలని ప్రవేశాల కమిటీలు నిర్ణయించాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకూ దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే వారిలో ఎక్కువ శాతం మంది విద్యార్థులకు డిగ్రీతోపాటు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో సీట్లు లభిస్తున్నాయి. దీంతో ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో చేరుతున్న ఆయా విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ విత్‌డ్రా చేసుకోవడం లేదు. దీంతో టాప్ డిగ్రీ కాలేజీల్లోని వేల సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీట్లు మిగిలిపోకుండా ఉండేందుకు ఎంసెట్–డిగ్రీ ప్రవేశాలను లింక్ చేయాలని ప్రవేశాల కమిటీలు నిర్ణయించాయి. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల(దోస్త్) కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటాచలం ఈ అంశంపై సమావేశమై చర్చించారు. రెండింటినీ ఆన్లైన్లో లింక్ చేయడం ద్వారా ఒక విద్యార్థి ఇంజనీరింగ్‌లో చేరితే డిగ్రీలో అతనికి వచ్చిన సీటు ఖాళీ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. తద్వారా సీట్లు మిగిలిపోకుండా చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. మరోవైపు డిగ్రీలో సీటు వచ్చిన విద్యార్థి తన సీటును కన్ఫర్మ్ చేసుకునేప్పుడు నిర్ణీత మొత్తాన్ని(ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.500) చెల్లించే నిబంధనను విధించాలని నిర్ణయించారు. విద్యార్థి కాలేజీలో చేరాక లేదా ఆ సీటును వదులుకున్నాక ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా నిబంధనను విధించనున్నారు. ఆధార్ ఉంటే మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ మరోవైపు డిగ్రీ ప్రవేశాల్లో ఆధార్‌ను అనుసంధానం చేయడంతోపాటు మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుసేందుకు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల(దోస్త్) కమిటీ చర్యలు చేపట్టింది. వివిధ డిగ్రీ కోర్సుల్లో చేరే దాదాపు 2.25 లక్షల మంది విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడం సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడం, ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల పొరపాట్లు దొర్లడం వంటి సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. విద్యార్థులే నేరుగా తమ మొబైల్ ఫోన్ల నుంచి ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికీ ఆధార్ లేని వారు పోస్టు ఆఫీసుల్లో ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దోస్త్ కమిటీ సూచించింది. మే 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసి, మే 10వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించే నాటికి కూడా ఆధార్ లేని వారు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలూ చేపట్టాలని నిర్ణయించాం. ప్రవేశాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ప్రతి డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్, సీనియర్ అధ్యాపకులతో కూడిన కమిటీని సంప్రదించవచ్చు. ఆ కమిటీ పరిధిలో సమస్య పరిష్కారం కాకపోతే ఇంటిగ్రేటెడ్ కాలేజీల ప్రిన్సిపాల్ నేతృత్వంలోని జిల్లా కోఆర్డినేషన్ కమిటీని సంప్రదిస్తే సమస్యను పరిష్కరిస్తుంది. అక్కడా సమస్యకు పరిష్కారం లభించకపోతే యూనివర్సిటీలోని కోఆర్డినేషన్ సెంటర్లో సంప్రదించవచ్చు. అయినా సమస్య అలాగే ఉంటే చివరగా కళాశాల విద్యా కమిషనరేట్, దోస్త్ కార్యాలయాల్లో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆయా కమిటీలకు సంబంధించిన సమగ్ర వివరాలను ఇంటర్ ఉత్తీర్ణులయ్యే ప్రతి విద్యార్థికి(మెమో డౌన్లోడ్ చేసుకునేప్పుడే) ఇన్ఫర్మేషన్ బులెటిన్ రూపంలో అందించేలా చర్యలు చేపడుతున్నాం. అలాగే ఈసారి ఎస్ఎంఎస్ సేవలను అందుబాటులోకి తెస్తాం. ఎప్పటికప్పుడు వివరాలను విద్యార్థికి పంపిస్తాం. – ప్రొఫెసర్ లింబాద్రి, దోస్త్ కన్వీనర్ -
రగడ!
- టీడీపీలో కమిటీల వార్ - పాత–కొత్త నేతల మధ్య కుదరని సయోధ్య - తమ మనుషులే ఉండాలంటూ పట్టు - ఐదు నియోజకవర్గాల్లో సమస్య సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో కమిటీల వార్ మొదలయ్యింది. పార్టీ కమిటీల్లో తమ మనుషులు ఉండాలంటూ పాత–కొత్త నేతలు వాగ్వాదానికి దిగుతున్నారు. జిల్లా మినీ మహానాడు నిర్వహణ తర్వాత... నియోజకవర్గస్థాయి కమిటీల ఏర్పాటుపై నేతలు దృష్టి సారించారు. అయితే, గతంలో ఉన్న నేతలు, కొత్తగా గోడదూకి పార్టీలోకి వచ్చిన నేతల మధ్య ప్రధానంగా గొడవ నడుస్తోంది. నందికొట్కూరు, శ్రీశైలం, కోడుమూరు, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాల్లో ప్రధానంగా గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. తమ మనుషులే కమిటీలో ఉండాలంటూ ఎవరికివారుగా పార్టీ అధిష్టానానికి ప్రతిపాదనలు సమర్పించారు. కేవలం తన అనుచరులతోనే కమిటీలు వేయించుకోవాలని ఎవరికివారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత–కొత్త నేతల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడచూపుతున్నాయి. అవమానిస్తూ...! కేవలం తమ మనుషులే పార్టీ కమిటీలో ఉండేలా చూసుకునేందుకు ఎవరికివారుగా ప్రయత్నిస్తూనే.. అవతలి నేతల అనుచరులను అవమానించే రీతిలో వైరి వర్గం నేతలు వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో పూర్తిగా తన నేతలకే పగ్గాలు అప్పగిస్తూ... వైరివర్గంలోని నేతల పేర్లను చిన్న చిన్న పోస్టులు అప్పగిస్తూ ఇరువురు నేతలు ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిసింది. ఇక కర్నూలులోనూ ఎమ్మెల్యే పూర్తిగా తన మనుషులకే పోస్టులు అప్పగిస్తూ... టీజీ మనుషులను బూత్స్థాఁఇ కమిటీలల్లో పేర్కొంటూ ప్రతిపాదనలు సమర్పించినట్టు సమాచారం. ఇక నందికొట్కూరులో మాండ్ర శివానందరెడ్డి వర్గీయులను పూర్తిగా పక్కకు నెట్టి... శిల్పా చక్రపాణి రెడ్డి రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కూడా ఈ మధ్యకాలంలో కార్యరంగంలోకి మళ్లీ దిగారు. ఇక కోడుమూరులో ఎమ్మెల్యే మణిగాంధీ, ఇన్చార్జీ విష్ణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. కమిటీల ఏర్పాటు ప్రక్రియలోనూ ఇదే విధంగా ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారు. నంద్యాలలోనూ భూమా వర్సెస్ శిల్పా రాజకీయం.. కమిటీల ఏర్పాటులోనూ నడుస్తోంది. అయితే, ఎదుటిపక్షానికి చెందిన నేతల పేర్లను కనీసం పేర్కొనకపోవడం...ఒకవేళ పేర్కొన్నప్పటికీ కిందిస్థాయి పోస్టులల్లో ప్రతిపాదించడం ద్వారా అవమానిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఏ వర్గానికి చెందిన నేతలు కమిటీలో నియమితులవుతారనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. ఎవరికి మద్దతుంటే..! వాస్తవానికి అధికారపార్టీలో కమిటీల నియామకం వాయిస్ మెస్సేజ్ ప్రక్రియ ద్వారా జరుగుతుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నిజంగా పనిచేసే నేతల పేర్లను కమిటీల పేర్కొనకపోయినప్పటికీ పార్టీ కార్యకర్తల నుంచి సేకరించే వాయిస్ మెస్సేజ్ ద్వారా కమిటీలో మార్పుచేర్పులు ఉంటాయని ఈ నేతలు స్పష్టం చేస్తున్నారు. నేతల మధ్య విభేదాలున్నప్పటికీ కమిటీల ఏర్పాటులో మాత్రం కేవలం నేతల సిఫారసులకే పెద్దపీట వేయడం కుదరదని అంటున్నారు. అయితే, కొత్తగా వచ్చిన నేతలు మాత్రం కేవలం తమ అనుచరులకే కమిటీలల్లో స్థానం దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలే నియోజకవర్గ ఇన్చార్జీలని.... వారు చెప్పించే కచ్చితంగా నెగ్గాలనే వాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. తద్వారా కేవలం తమ అనుచరులకే పార్టీ కమిటీల అధికారాలు కట్టబెట్టి సంపూర్ణ అధికారాన్ని అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోనూ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేదిక చేసుకోవడంతో ఇప్పుడు అధికార రాజకీయ నాటకం రక్తికడుతోంది. -
కమిటీలపై టీఆర్ఎస్ కొత్త విధానం
♦ రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు! ♦ ఏడు జిల్లాలకో పరిశీలకుని నియామకం ♦ నియోజకవర్గ కమిటీల్లో 20 నుంచి 24 మందికి అవకాశం ♦ ప్రతి జిల్లాకు ఇద్దరు ఇన్చార్జిలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత మార్పుచేర్పులకు కసరత్తు చేస్తోంది. రెండేళ్లుగా కమిటీలు లేకుండానే పార్టీ కార్య క్రమాలను నిర్వహించగా ఈ నెల 21న పార్టీ 16వ ప్లీనరీ సందర్భంగా వివిధ స్థాయిల్లో సంస్థాగత కమిటీలను నియమించే పనిలో అధిష్టానం మునిగిపోయింది. గురువారం నాటికే సభ్యత్వ నమోదు గడువు పూర్తయిన నేపథ్యంలో గ్రామ కమిటీల నుంచి మండల, నియోజకవర్గ కమిటీల ఎంపికపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పార్టీ కమిటీల నియామకాల్లో కొత్త విధానాలను ప్రవేశపెడు తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలకే పూర్తి ప్రాధా న్యమిస్తూ నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయనుండగా నియోజకవర్గాల నుంచి నేరుగా పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు, వాస్త వాలు తెలుసుకునేందుకు, దిశానిర్దేశం చేసేం దుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ఒక పర్యవేక్షక కమిటీని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ నాయకత్వ వర్గాలు చెబు తున్న వివరాల మేరకు కనీసం ఏడు జిల్లాలకు ఒక పరిశీలకుడిని నియమించనున్నారు. మొత్తంగా కనీసం ఏడుగురు సీనియర్ నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని, ఈ కమిటీ పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్ నుంచే కార్యకలాపాలు సాగిస్తుందని చెబుతున్నారు. మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు, సరైన మార్గదర్శకత్వం చూపేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. దీంతో జిల్లాలపై పెత్తనమంతా రాష్ట్ర కమిటీదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గ కమిటీల్లో 24 మంది? జిల్లా స్థాయి కమిటీలను రద్దు చేయాలని ప్రాథమికంగా ఇప్పటికే నిర్ణయం తీసు కోవడంతో పార్టీలో ఇక నుంచి నియోజకవర్గ కమిటీలే కీలకం కానున్నాయి. అయితే జిల్లా కమిటీలు రద్దయినా ఆయా జిల్లాలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలను ఇన్చార్జిలుగా నియమించనున్నారని, వారు జిల్లాస్థాయి కార్యక్రమాలను సమన్వయం చేస్తారని, అంతకు మించి పెద్దగా వారి పాత్ర ఏమీ ఉండకపోవచ్చని పేర్కొంటు న్నారు. జిల్లాస్థాయి కమిటీల రద్దు నిర్ణయం వల్ల పదవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. అయితే వారందరినీ ఆయా పార్టీ పదవుల్లో సర్దేందుకు నియోజకవర్గ కమిటీలను ఉపయోగించుకోనున్నారు. ఒక్కో నియోజకవర్గ కమిటీలో 24 మందికి తక్కువ కాకుండా సభ్యులు ఉంటారని, వారి నుంచే నియోజకవర్గ కన్వీనర్లు, ఇతర పదవులకు ఎంపిక చేసుకుంటారని తెలుస్తోంది. పూర్తిగా ఎమ్మెల్యేల కను సన్నల్లో పనిచేసే నియోజకవర్గ కమిటీల్లో ఎంపిక బాధ్యత కూడా వారికే అప్ప జెప్పారు. గ్రామ, పట్టణ, మండలస్థాయి కమిటీలు మాత్రం యథావిధిగా కొనసాగ నున్నాయి. కాగా, నియోజవకర్గస్థాయి కమిటీల్లో ఎందరికి అవకాశం కల్పిస్తారన్న సందేహాలు పార్టీ వర్గాల్లో ఓవైపు నెలకొనగా మరోవైపు రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో సభ్యుల సంఖ్యను తగ్గించే వీలుందని తెలుస్తోంది. -
వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఈ–ఆఫీస్ విధానం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : జిల్లాలోని 20 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఈ–ఆఫీస్ విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేఆర్ కిషోర్ అన్నారు. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ సమావేశ మందిరంలో 20 వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బందికి ఈ–ఆఫీస్ విధానంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, ఈ–ఆఫీస్ విధానం వలన పనులు వేగవంతంగా జరుగుతాయన్నారు. ప్రస్తుత విధానంలో కార్యాలయాల్లో ఫైళ్లు భద్రపరచడం కష్టంగా ఉందన్నారు. ఇక నుంచి ఫైళ్లను భద్రపరచాల్సిన అవసరం ఉండదని, వచ్చే నెల మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో కాగిత రహిత పాలన సాగుతుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై వ్యవసాయ మార్కెటింగ్ సిబ్బంది పట్టు సాధించాలన్నారు. -
’బీసీ ఉద్యమమే నాకు ముఖ్యం’
-
హామీలే... ఏమీలే
- పేరుకే ‘స్వచ్ఛ హైదరాబాద్’ కమిటీలు - అమలుకు నోచని సిఫారసులు - ఎక్కడి సమస్యలు అక్కడే - అన్ని విభాగాలదీ ఒకటే తీరు సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’తో విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సమస్యలను గుర్తించడం... వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు వెల్లడించింది. కానీ అధిక శాతం సమస్యలది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న తీరే. ప్రభుత్వ పెద్దల హామీలలో అనేకం కాగితాల మీద నుంచి కిందకు దిగలేదు. గతమే నెలలో నిర్వహించిన తొలి విడత ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ఫిర్యాదులను, ప్రభుత్వం దృష్టికి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకొని జూన్‌లో అన్ని పార్టీల నేతలతో ‘స్వచ్ఛ కమిటీలను’ నియమించారు. జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, హెచ్ఎండీఏ, విద్యుత్ విభాగాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. సమస్యల పరిష్కారానికి ఇవి కొన్ని సిఫారసులు చేశాయి. వీటికి రూ.200 కోట్లు మంజూరు చేశారు. విభాగాల వారీగా ఎవరేం పనులు చేయాలో నిర్ణయించారు. జీహెచ్ఎంసీకి సంబంధించి పనులను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక అనే మూడు విభాగాలుగా వర్గీకరించారు. వీటిలో స్వల్పకాలిక పనులు ముందంజలో ఉన్నాయి. మిగతా విభాగాలతో పోలిస్తే జీహెచ్ఎంసీ కొంత ముందంజలో ఉందనే చెప్పాలి. సిఫారసులు.. అమలు తీరు - ఇంటింటి నుంచి చెత్త సేకరణకు అదనంగా వెయ్యి రిక్షాలు కొనుగోలు చేయాలని నిర్ణయం. - ఇంకా కొనలేదు. - చెత్త తరలింపునకు 2500 ఆటో టిప్పర్ల కొనుగోలుకు నిర్ణయం. - పనులు పురోగతిలో ఉన్నాయి. ఆటో టిప్పర్ల ఎంపిక పూర్తయింది. వీటిని డ్రైవర్ కమ్ ఓనర్ తరహాలో లబ్ధిదారులకు అందజేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. - చెత్త తరలించేందుకు పాత వాటి స్థానే కొత్తగా 145 వాహనాల కొనుగోలుకు నిర్ణయం. - వీటిపై కదలిక లేదు. - చెత్త నుంచి విద్యుత్ తయారీకి నగరానికి నాలుగు వైపులా 4 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం. - బీబీనగర్ సమీపంలోని ఆర్డీఎఫ్ ప్లాంట్, జవహర్ నగర్ ప్లాంట్లను పరిశీలించారు. - పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలని సిఫారసు. మెరుగైన వైద్య సౌకర్యాలు, గృహ సౌకర్యం కల్పించాలని యోచన. - వేతనాలను రూ.8,500 నుంచి రూ.12,500కు పెంచారు. గృహాల కోసం స్థలాలు అన్వేషిస్తున్నారు. వైద్య సదుపాయంపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. - జవాబుదారీతనానికి ఆధునిక సాంకేతిక పద్ధతులు అమలులోకితేవాలని నిర్ణయం. - ఇందులో భాగంగా హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానాన్ని ఒక సర్కిల్లో ప్రారంభించారు. మిగతా సర్కిళ్లలోనూ త్వరలో చేపట్టేందుకు సిద్ధమయ్యారు. - 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ నిషేధానికి నిర్ణయం. ఇందులో భాగంగా ప్లాస్టిక్ పరిశ్రమల తనిఖీకి నిర్ణయం. - కానీ ఇంతవరకు తనిఖీలు జరగలేదు. - పీపీపీ విధానంలో డెబ్రిస్ తరలింపునకు నిర్ణయం. - టెండర్లు పిలిచారు. త్వరలో ఖరారు కానున్నాయి. - డెబ్రిస్ తరలింపునకు శివార్లలోని మైనింగ్ ప్రదేశాలను గుర్తించాలని నిర్ణయించారు. - ఎంతవరకొచ్చిందో తెలియదు. - అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మళ్లీ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ల అమలుకు నిర్ణయం. - ప్రత్యేకంగా కమిటీని నియమించారు. దీని సూచనల మేరకు చర్యలు తీసుకుంటారు. - భవన నిర్మాణ అనుమతులకు పారదర్శక విధానాలు అమల్లోకి తేవాలని.. ప్రస్తుత విధానాలను సరళీకరించాలని నిర్ణయించారు. - ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. ఇంకా అందుబాటులోకి రాలేదు. - నాలాల ఆధునీకరణ కోసం ఇళ్లు కోల్పోయే వారికి ప్యాకేజీ అందజేయాలని నిర్ణయించారు. - ప్యాకేజీని ఇంకా ప్రకటించలేదు. - నాలాల మార్గాల్లో బాటిల్‌నెక్స్ గుర్తించి, సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. ప్రాధాన్యం మేరకు పనులు చేయాలని నిర్ణయించినప్పటికీ.. మొదలు కాలేదు. దీనికి రూ.223 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. - చెత్త, వ్యర్థాలు వేయకుండా అన్ని మేజర్ నాలాల వెంబడి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. - పనులు పూర్తి కాలేదు. - దెబ్బతిన్న రోడ్లన్నీ వెంటనే రీకార్పెట్ చేయాలని సిఫార్సు చేశారు. - కానీ చాలా ప్రాంతాల్లో రోడ్లు పరమ అధ్వానంగా ఉన్నాయి. - ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం - ఏఈఈల నియామకాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్నోటిఫికేషన్ జారీ అయింది. - విద్యుత్ ఖర్చుల తగ్గింపునకు ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం - ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. - ఎస్సార్డీపీ ద్వారా రూ.20 వేల కోట్లతో ఫ్లై ఓవర్లు నిర్మించాలని సూచన. -
దేశం కమిటీల దందా!
- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై స్వారీ - రేషన్ బియ్యం నుంచి రుణమాఫీ వరకు జోక్యం - అనుయాయులకే లబ్ధి చేకూరేలా అధికారులపై ఒత్తిళ్లు గుంటూరు ఈస్ట్ : తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలు, రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై స్వారీ చేస్తున్నాయి. తమ ఇష్టులకు మాత్రమే పథకాలు వర్తించేలా అధికారులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇతర పార్టీల సర్పంచ్‌లను సైతం కాదని టీడీపీ అనుయాయులకే లబ్ధి చేకూరుస్తున్నాయి. దీపం పథకం : కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 28 వేల దీపం కనెక్షన్లు మంజూరు చేసింది. జిల్లాలోని 12 మున్సిపాల్టీలు, 57 మండలాలు, గుంటూరు కార్పొరేషన్‌లోని అర్హులకు ఈ పథకం కింద దరఖాస్తులు తీసుకుని కనెక్షన్లు మంజూరు చేయాలి. అన్ని మండలాల్లో తహశీల్దార్లు గ్రామ కమిటీలు సిఫారసు చేసిన వారి దరఖాస్తులనే తీసుకొంటున్నారు. ఇదేమని బీజేపీ, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వారంతా వాపోతున్నారు. రుణమాఫీలోనూ మతలబే... జిల్లాలో రుణమాఫీకాని రైతుల కోసం ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టరు కార్యాలయంలో ప్రారంభించారు. ఇక్కడకు వచ్చిన వందలాది మంది రైతుల వివరాలు వెబ్సైట్లో నమోదు కాలేదని ఇప్పుడు దరఖాస్తు ఇవ్వడానికి అర్హత లేదని సమాధానం వచ్చింది. అన్ని అర్హతలు ఉండి ఇప్పటికి రెండుసార్లు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం పత్రాలన్నీ సమర్పించినా, తమ వివరాలు కనీసం వెబ్సైట్లో నమోదు కాకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులోనూ టీడీపీ నాయకులు అనధికారికంగా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాల్సిన రైతుల పేర్లను టీడీపీ నాయకులు ఆయా మండలాల్లో బ్యాంకర్లకు సూచించారని తెలుస్తోంది. ఆ ప్రకారమే రుణమాఫీ జరిగినట్టు సమాచారం. ఇతర పథకాల్లోనూ ఇదే తంతు... వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ మాటే చెల్లుబాటు అవుతోంది. వారు సూచించిన వారికే ప్రథమ స్థానం లభిస్తోంది. వీటితోపాటు రైతులకు స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టలు, డ్రయర్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై సరఫరా చేసే విషయంలోను గ్రామ కమిటీ సభ్యుల హవాయే కొనసాగుతోంది. సర్పంచులు, వీర్వోలు, వీఆర్ఏలు, సెక్రటరీలు మాట ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదు. రేషన్ బియ్యం, పింఛన్‌పై బతికే అభాగ్యులపై కూడా గ్రామ కమిటీ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. సర్పంచ్ల పరిస్థితి అగమ్యగోచరం... ఇతర పార్టీల జెండాపై గెలిచిన సర్పంచ్‌లను డమ్మీలు చేస్తున్నారు. గ్రామ కమిటీ సభ్యులు చేసే అసత్య ఆరోపణలకు అధికారులు స్పందించి ఇతర పార్టీల సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, డ్వాక్రా మహిళల విషయంలో పార్టీల పరంగా వ్య త్యాసాలు చూపించడమేకాకుండా వారిపై వేటు వేస్తున్నారు. అనేక మండలాల్లో, గ్రామాల్లో టీడీపీ నాయకుల ప్రతాపానికి గురైన మహిళలు గత 9 నెలల్లో వందలాదిమంది జిల్లా అధికారుల వద్దకు వచ్చి తమ బాధలను వెళ్లబోసుకున్నారు. -
కంగాళీ.. కాంగ్రెస్!
కమిటీలు లేని జాతీయ పార్టీ తొమ్మిది నెలలుగా ఇదే పరిస్థితి పీసీసీ చీఫ్ సొంత జిల్లాలోనే ఈ దుస్థితి కాంగ్రెస్ పటిష్టానికి నేడు జిల్లా స్థాయి చర్చలు పాల్గొనేది ఎవరో తెలియని అయోమయం వరంగల్ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆ పార్టీకి తొమ్మిది నెలలుగా కనీసం కమిటీలు కూడా లేవు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలోనే జిల్లా కమిటీ లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. సాధారణ ఎన్నికల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇదే రోజు అన్ని జిల్లాలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇటీవల పీసీసీ స్థాయిలో జరిగిన సమావేశంలో పాల్గొనని నేతలు ఈ చర్చల్లో పాల్గొనాలని హస్తం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. జిల్లాలో ఎమ్మెల్యే, ఆ స్థాయి నేతలు వరుసగా పార్టీని వీడి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో స్థైర్యం నింపాల్సిన కాంగ్రెస అధిష్టానం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పీసీసీ స్థాయిలో ఇష్టారీతిన పదవులు కట్టబెడుతున్న లక్ష్మయ్యకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే విషయంలో పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. స్పందన లేని ‘పొన్నాల’ గత ఏప్రిల్ నుంచి జరిగిన సాధారణ, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది. అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. అధికారంపోవడం, నాయకుల క్రమశిక్షణ రాహిత్యంతో జిల్లా కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ ఎన్నికల్లో ఓటమిని పాఠాలను అధిగించి మళ్లీ బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం అన్ని స్థాయిల్లో సమర్థులైన నాయకుల కోసం అన్వేషిస్తోంది. జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధమైన పరిస్థితి ఉంది. కనీసం కార్యవర్గాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కోసం డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి 2014 ఆగస్టులో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ప్రతిపాదనలు పంపారు. నాయినిని పూర్తి స్థాయి డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) జనవరి 12న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నా.. జిల్లా కార్యవర్గం ఏర్పాటు కోసం పొన్నాల మాత్రం స్పందించడంలేదని కాంగ్రెస్ వర్గాలు వాపోతున్నాయి. కాగా ఆదివారం జరిగే సమావేశంలో ఎవరు పాల్గొంటారనేది తెలియని అయోమయ స్థితిలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారంటే కాంగ్రెస్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
ప్రభుత్వ కమిటీల్లో సామాజిక కార్యకర్తలా?
హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖ వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కమిటీల్లో సామాజిక కార్యకర్తలను సభ్యులుగా ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. కమిటీలకు ఉన్నత వర్గాలు పెద్దలుగా ఉండడమేంటని ప్రశ్నించారు. గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. -
కాలయాపన కమిటీలు!
కమలనాథన్ కమిటీ, ప్రత్యూష సిన్హా కమిటీ.. ఇంతవరకు ఈ రెండు కమిటీలూ అలాగే ఉన్నాయి. ఒక్కటి కూడా రెండు రాష్ట్రా ల ఉద్యోగుల విభజనపై నివేదిక ఇవ్వలేదు. డిసెంబర్లో అని మార్చిలో అని, ఎప్పటికప్పుడు కాలయాపన చేయడం తప్ప ఇంతవరకు ఇవి ఒరగబెట్టిందేమీ లేదు. దీనికి తోడు రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు మాట్లాడితే ఢిల్లీ పోవడం, రావడం, అభ్యంతరాలు చెప్పడంతోటే సరిపో యింది. ఇలా ప్రజాధనం ఖర్చు చేయడం ఏలిన వారికి ఎంతవరకూ సమంజసం? ఒక పక్క ప్రజా ధనం పొదుపుగా వాడాలని మన నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొడుతుంటారు కదా. మరి అవి అధికారులకు వర్తించవా? ఐఏఎస్ అధికారుల కేటాయిం పు, రెండు రాష్ట్రాల ఉద్యోగుల కేటాయింపు రెండూ నత్త నడకే. దీంతో కింది నుంచి పైస్థాయి వరకు అధికారులలో అసంతృప్తి చోటు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వ పనులు నత్తనడకకు కారణం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రెండు కమిటీలు తమ నివేదికలు వీలైనంత త్వరగా పూర్తి చేసి అధికారుల విభ జన చేసి ఇరురాష్ట్రాల అభివృద్ధికి దోహదపడేలా సహకరించాలి. ఎస్. పద్మావతి చిక్కడపల్లి, హైదరాబాద్ -
కమిటీలు @ తమ్ముళ్లు
సాక్షి, కడప : తొమ్మిదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో బాబు అందరికీ ఏదో ఒకటి చేయాలనుకున్నారో.... లేక ప్రతి పథకం తమవారి అధీనంలోనే ఉండాలని భావించారో తెలియదుగానీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రజలను విస్తుపోయేలా చేస్తున్నాయి. సంఘ సేవకుల ముసుగులో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలను తీసుకొచ్చి పలు కమిటీల్లో కూర్చొబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఏ కమిటీలో అరుునా తెలుగు తమ్ముళ్లు ఉండాల్సిందే. ప్రజాస్వామ్య బద్దంగా, చట్ట ప్రకారం... రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సైతం పక్కన పెట్టి కేవలం కొంతమంది అధికారులతోపాటు సేవకుల ముసుగులో తమ్ముళ్లను కమిటీల్లో చేర్చడం విశేషం. జన్మభూమి, పింఛన్ల తరహాలోనే రుణాలకు సంబంధించిన కమిటీల్లో కూడా తమ్ముళ్లకు చోటు కల్పించేందుకు సర్వం సిద్దం చేశారు. వివరాల్లోకి వెళితే.... జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రుణాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఈనెల మొదటి వారం నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. షాపులతోపాటు ఫ్యాన్సీ స్టోర్స్, పశువుల, గొర్రెల యూనిట్లు, పలు మిషన్లకు సంబంధించి వాటితోపాటు అనేక రకాల స్వయం ఉపాధికి పలువురు జిల్లాలోని ఎస్సీ ఎస్టీలకు చెందిన నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరందరికీ డిసెంబరు 1 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. మండల కమిటీలో తమ్ముళ్లకు అవకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను ఇంటర్వ్యూల అనంతరం కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదేశాల మేరకు కమిటీలను నియమిస్తారు. ఎంపీడీఓ కన్వీనర్‌గా, మండల సమాఖ్య అధ్యక్షురాలితోపాటు ముగ్గురు సంఘ సేవకులు, వెలుగు ఏపీఎంలు కమిటీలో ఉండనున్నారు. ఇంటర్వ్యూలో బ్యాంకర్లు కూడా కూర్చొంటారు. సంఘ సేవకులంటే టీడీపీలో మండల స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే పలువురు చోటా నేతలను తీసుకొచ్చి సేవకులుగా కమిటీలో చేరుస్తున్నారు. అందుకు సంబంధించి రెండు రోజుల క్రితం జిల్లా నుంచి అన్ని ఎంపీడీఓ కార్యాలయాలకు కమిటీలలో అధికారికంగా సంఘ సేవకులు...అనధికారికంగా తమ్ముళ్లను చేర్చుకోవాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. భగ్గుముంటున్న ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ రుణాలకు సంబంధించి వాటితోపాటు సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణాల విషయంలో కూడా కమిటీలలో సేవకుల ముసుగులో తమ్ముళ్లను చేరుస్తుండడంపై ప్రజాప్రతినిధులను భగ్గుమంటున్నారు. జన్మభూమి, పింఛన్ల పర్యవేక్షణ కమిటీలలో కనీసం కొంతైనా ప్రజాప్రతినిధులకు గౌరవాన్ని కల్పించారు. సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీలను కమిటీ సమావేశాల్లో ప్రాధాన్యం కల్పించారు. అయితే ఎస్సీ ఎస్టీరుణాలకు సంబంధించి ఎంపిక కమిటీలో ప్రజాప్రతినిధులు గల్లంతు కావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ,ఎంపీపీ లాంటి ప్రజాప్రతినిధులు ప్రజల ఆదరణతో గెలుపొందినా.....మండల స్థాయిలో లబ్దిదారుల రుణాల కమిటీ విషయంలో వింత ధోరణి పాటించడంపై సర్వత్రా ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా కమిటీల విషయంలో పారదర్శకత పాటించకపోవడంపై పలువురు పెదవి విరిస్తున్నారు. -
కమిటీలు లేని కాంగ్రెస్
‘పొన్నాల’ సొంత జిల్లాలోనే దుస్థితి కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం పాతవారి పెత్తనంలో అసంతృప్తులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కార్యవర్గాలు లేని దుస్థితి నెలకొంది. ఆరు నెలలుగా కార్యవర్గం, బాధ్యులు లేకపోవడంతో పార్టీ గందరగోళంగా మారింది. జిల్లా అధ్యక్షుడు ఒక్కరే ఉన్నారు. జిల్లా కార్యవర్గం ఏర్పాటు కోసం పీసీసీకి పంపిన ప్రతిపాదనలకు మోక్షం దొరకడం లేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ ప్రతిపాదనలు కనీసం పరిశీలించిన దాఖలాలు కనిపించడం లేదు. పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలోనే కాంగ్రెస్ జిల్లా కమిటీ లేకపోవడంపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కమిటీలు లేకపోవడం పార్టీ ప్రతిష్టకు ఇబ్బం దిగా ఉందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. జిల్లా కమిటీ లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై స్పందించే బాధ్యతను నిర్వర్తించే విషయంలో ఎవరూ చొరవ తీసుకోవడం లేదని వాపోతున్నారు. కరెంటు కోతలు, రైతుల సమస్యలు, సామాజిక పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో సానుకూలత సంపాదించుకునేందు ఎవరు చొరవ తీసుకోవాలనే విషయంలో అయోమయం నెలకొందని చెబుతున్నారు. పీసీసీ స్థాయిలో రోజుకు ఒకరికి పదవులు ఖరారు చేస్తున్న పొన్నాల లక్ష్మయ్యకు జిల్లాలో మాత్రం పార్టీని పట్టించుకునే తీరిక ఉండడం లేదని జిల్లా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నిర్వేదం సాధారణ ఎన్నికల సమయంలో దొంతి మాధవరెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ ముందుగా మా ధవరెడ్డికి ఖరారు చేసి తర్వాత తొలగించారు. దీనికి నిరసనగా ఆయన పార్టీకి, పదవికి రాజీ నామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నర్సంపేట నుంచి పోటీ చేశారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గం రద్దయింది. ఎన్నికల ముందు కీలక సమయంలో నాయిని రాజేందర్‌రెడ్డికి పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల సమయం కావడంతో అసంతృప్తులు వ్యక్తమవుతాయని భా వించి వెంటనే జిల్లా కమిటీలను కొత్తగా ఏర్పా టు చేయలేదు. పాత కార్యవర్గంలోని వారు అదే పదవుల్లో ఉన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చా రు. సాధారణ, జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ నా యకులు పరాజయం పొందారు. దీనికి బాధ్యులను చేస్తూ పార్టీ నుంచి పలువురు ముఖ్యనాయకులను సస్పెండ్ చేశారు. ఇలా వరుస దెబ్బలతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బాగా నష్టపోయింది. ఇలాంటి దుస్థితిని నుంచి బటయపడేందుకు కాంగ్రెస్‌ను మళ్లీ పటిష్ట పరచాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీ కోసం కష్టపడే తత్వం ఉన్న నాయకులను గుర్తించి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది. కాంగ్రెస్‌లో జిల్లా పార్టీ కార్యవర్గం ఏర్పాటు కోసం పీసీసీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. రెండు నెలల క్రితమే వరంగల్ జిల్లా పార్టీ కార్యవర్గం ఏర్పాటు కో సం పీసీసీకి ప్రతిపాదనలు వెళ్లాయి. పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా అయినా ఈ ప్రతిపాదనలకు ఆమోదం రావడం లేదు. తెలంగాణలో రెండు పెద్ద నగరంగా ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ త్వరలో నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్ నగర కమిటీ, జిల్లా కమిటీ సమన్వయంతో ఈ ఎన్నికలను ఎదుర్కొని బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ జిల్లా కమిటీ లేకపోవడం కాంగ్రెస్ శ్రేణులను నిర్వేదానికి గురి చేస్తోంది. పాతవారి పెత్తనం కాంగ్రెస్‌లో జిల్లా కమిటీ లేకపోవడంతో సీనియర్ నేతలుగా చెప్పుకునేవారే అంతా తామనే విధంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజల్లో వ్యతిరేకతతో ఓటమిపాలైన నేతలో ఇప్పుడు మేము అంటూ వ్యవహరిస్తుండడం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడడంలేదు. ‘అధికారంలో ఉన్నన్ని రోజులు కార్యకర్తలను పట్టించుకోని వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజలు తిరస్కరించిన వీరు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. ఇది మా పార్టీకి లాభం కంటే నష్టమే చేస్తోంది. ఇప్పుడైనా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది’ అని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయడుతున్నారు. -
దేవాలయాల పాలక మండళ్ల ఏర్పాటుకు కసరత్తు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ మినహా మిగిలిన దేవాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. కోటి నుంచి 20 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దేవాలయాలకు పాలక మండళ్ల నియమకానికి నిర్ణయం తీసుకుంది. 5 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దేవాలయాలకు 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే 5 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఆదాయమున్న దేవాలయాలకు 11 మందితో, 20 కోట్ల రూపాయలపైగా ఆదాయమున్న దేవాలయాలకు 15 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. -
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుల నియామకం
హైదరాబాద్: పార్టీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన కమిటీలోని పీఏసీ సభ్యుల పేర్లను వైఎస్సార్ సీపీ ఖరారు చేసింది. రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ)ని మరింత విస్తరించే క్రమంలో వైఎస్సార్ సీపీ మరో కొంతమందిని నూతన కమిటీలో సభ్యులుగా నియమించింది. పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అనేక మార్పులు చేశారు. ఇప్పటికే పీఏసీలో పలువురు సభ్యులను నియమించిన పార్టీ.. వీరికి అదనంగా మరో కొంతమందిని ఎంపిక చేసింది. రాష్ట్ర వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సరికొత్త బాధ్యతలు అప్పజెప్పగా, సెక్రటరీలుగా నిర్మలాకుమారి, అవ్వారు ముసలయ్య, గాంధీ, మేరుగ మురళీలను నియమించారు. ఈ రోజు ప్రకటించిన వైఎస్సార్ సీపీ నూతన కమిటీలోని సభ్యుల వివరాలు.. పీఏసీ సభ్యులు..సాగి దుర్గా ప్రసాదరాజు, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారధి జనరల్ సెక్రటరీలు.. కారుమూరి నాగేశ్వరరావు, తలశిల రఘురాం నియామకం డాక్టర్స్‌వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా దుట్టారామచంద్రరావు వాలంటీర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సెక్రటరీలుగా నిర్మలాకుమారి, అవ్వారు ముసలయ్య, గాంధీ, మేరుగ మురళీ సీజీ సీ సభ్యులు.. గురునాథరెడ్డి, రెహమాన్, జక్కంపూడి విజయలక్ష్మి పార్లమెంట్ అబ్జర్వర్స్..కొత్త కోట ప్రకాశ్ రెడ్డి, సురేశ్ బాబు -
వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణ
-
చెత్తబుట్టలో వేయడం... ఫ్యాషనైపోయింది
ప్రజల నుంచి ఆందోళనలు ఎదురైనా... తనకు ఏ సమస్య వచ్చిన ప్రభుత్వానికి వెంటనే గుర్తుకు వచ్చేది 'కమిటీ' ... అది ఏ సమస్య అయినా... రాష్ట్ర విభజన, రాష్ట్ర రాజధాని ఎంపిక, మహిళలపై అత్యాచారాలు.... అన్నింటీకి ఒకటే మందు కమిటీ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ప్రజలు పోరాటం చేస్తుంటే వారికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడంతో పాటు ఆ సమస్య నుంచి బయటపడటానికి 'కమిటీ' కల్లోలంలో ఉన్న ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే ఓ చుక్కాని . అలా వచ్చినవే రాష్ట్ర విజభనపై ఏర్పాటైన జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ, ఏపీ నూతన రాజధాని ఎంపికపై ఏర్పాటైన ప్రొ. శివరామకృష్ణన్ కమిటీ. విభజన నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహాంతో ఉగిపోతుంటే... ఆ సమస్య నుంచి గట్టేక్కడానికి కేంద్రం ప్రొ.శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి నిర్దిష్ట కాలపరిమితిని విధిస్తుంది... ఎందుకంటే ఆ కాలపరిమితి వరకు ప్రజలు శాంతంగా ఉంటారని. నిర్ణీత కాలవ్యవధిలో ఆ కమిటీ తన నివేదికను ప్రభుత్వం అందజేస్తుంది. కానీ ఆ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా బుట్టదాఖలు చేస్తుంది. గతంలో ఇలాగే జరిగింది. ఇప్పుడూ అలాగే... ఏపీ నూతన రాజధాని ఎంపిక చేసి ఆగస్టు 31నాటికి నివేదిక అందజేయాలని ప్రొ.శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ నివేదికలో పలు కీలక అంశాలు నిర్దేశిస్తూ ఆ కమిటీ కేంద్రానికి నివేదిక అందజేసింది. ఆ కమిటీలోని ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా... రాజధాని ఎంపిక తమ ఇష్టం వచ్చిన చోట నిర్ణయిస్తామంటూ టీడీపీ ప్రభుత్వం వ్యవహారిస్తుంది. కమిటీలను ఏర్పాటు చేయడం... ఆ కమిటీ నివేదికలను పట్టించుకోకుండా... తాము అనుకున్నదే జరగాలి అని తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా ప్రభుత్వాలు వ్యవహారిస్తున్నాయి. ప్రభుత్వాలు ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తుంటే ఆ కమిటీల పేరుతో ప్రజలను వంచించి.. వారి సొమ్మును దుర్వినియోగం చేయడం ఎంత వరకు సబబు అని ప్రజలు అడుగుతున్నారు. వివిధ సమస్యలపేరుతో కమిటీలు ఏర్పాటు చేసి... ఆ నివేదికలు అందిన వెంటనే బుట్టలో పడేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫ్యాషనైపోయిందని వారు విమర్శిస్తున్నారు. -
బలోపేతం
సాక్షి, చెన్నై: పార్టీ బలోపేతం లక్ష్యంగా సిద్ధం చేయాల్సిన కార్యాచరణపై డీఎంకే అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. పార్టీలో ప్రక్షాళన లక్ష్యంగా సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. ఇందులో ఆరుగురికి చోటు కల్పించింది. ఇక, తన వ్యూహాలకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి పదును పెట్టే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం డీఎంకేను వెంటాడుతోంది. వరుస ఓటములతో డీఎంకే శ్రేణులు డీలా పడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఆ పార్టీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది. ఓటమికి కారణాలెన్ని ఉన్నా, రానున్న రోజుల్లో పార్టీలో సరికొత్త మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఉన్నారు. ఎన్నికల్లో అనేక జిల్లాల నేతలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని పరిగణనలోకి తీసుకుని అక్కడి నేతలను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందు కోసం జిల్లా స్థాయిలో కమిటీలను రద్దు చేసి, సరి కొత్తగా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు, కార్పొరేషన్ల స్థాయిలో కమిటీల ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఈ కమిటీల ద్వారా ఆయా అసెంబ్లీ, లోక్ సభ, కార్పొరేషన్ల పరిధుల్లోని కుగ్రామాలు, పంచాయతీలు, వార్డుల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి కింది స్థాయి నుంచి పార్టీలో సమూల మార్పులకు నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల రెండో తేదీన రాష్ట్ర పార్టీ కార్యాలయం అన్నా అరివాళయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ పై అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరుగురితో కమిటీ: ఉన్నత స్థాయిసమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీలో సమూల మార్పు, సరికొత్త తరహాలో కమిటీల ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం డీఎంకే అధిష్టానం చేసింది. అయితే, ఎలాంటి పద్ధతిలో సమూల మార్పు, సరికొత్త తరహా అంశాలను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సమావేశంలో తీసుకున్న మార్పు నిర్ణయాలు, సరికొత్త అంశాల గురించి జిల్లాల వారీగా చర్చించి పార్టీ బలోపేతానికి ఆయా జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యల గురించి పరిశీలనకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించారు. తన వ్యూహాల అమలు లక్ష్యంగా, వాటికి పదును పెట్టడంతో పాటుగా సరికొత్తగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ కమిటీని కరుణానిధి గురువారం ప్రకటించారు. ఈ కమిటీలో పార్టీ నేతలు తిరు వెంగడం, టీఎస్ కల్యాణ సుందరం, రాజమాణిక్యం, తంగం తెన్నరసు(ఎమ్మెల్యే), కేఎస్ రాధాకృష్ణన్, సచ్చిదానందన్‌కు చోటు కల్పించారు. ఈ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించ నున్నది. ఎక్కడక్కడ పార్టీ బలహీనంగా ఉన్నదో పరిశీలించి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను ఆరా తీయనుంది. అన్ని ప్రాంతాల్లో పార్టీల ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలు సేకరించనుంది. పూర్తి స్థాయిలో పరిశీలన ప్రక్రియను ముగించినానంతరం నివేదికను పార్టీ అధిష్టానానికి ఈ కమిటీ సమర్పించనుంది. -
ఆరు నెలల్లో కొత్త రాజధాని నిర్ణయం: జైరాం రమేష్
ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ మొదలైందని, ఇందుకోసం రెండు కమిటీలు ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి, తెలంగాణపై కేంద్రం నియమించిన జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. ఆలిండియా సర్వీసు అధికారుల పంపిణీ కోసం ఒక కమిటీ, రాష్ట్ర స్థాయి అధికారుల కోసం మరో కమిటీ వేసినట్లు ఆయన చెప్పారు. సీమాంధ్ర రాజధాని నిర్ణయం కోసం నిపుణుల కమిటీ ఒకదాన్ని నియమిస్తామని, రాజధాని ఎక్కడ ఉండాలో ఆరు నెలల్లోగా ఆ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే, ఇంతకుముందు 45 రోజుల్లోగా కొత్త రాజధాని ఎక్కడో చెబుతామన్నా.. దాన్ని సవరించి ఆరు నెలలుగా చేసినట్లు ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తిరిగి సీమాంధ్రలో కలుపుతామని, అయితే బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు మాత్రం తెలంగాణలోనే ఉంటాయని ఆయన చెప్పారు. ఇందుకోసం త్వరలోనే కేంద్రం ఆర్డినెన్స్ తెస్తుందన్నారు. సీమాంధ్ర ఆర్థిక ప్రణాళిక అమలు కోసం ప్లానింగ్ కమిషన్‌లో ప్రత్యేక కమిటీ వేశామని, అది వచ్చే వారం నుంచి పని చేస్తుందని జైరాం రమేష్ అన్నారు. 4, 5 రోజుల్లో రాష్ట్ర ఏర్పాటుపై గెజిట్ విడుదలవుతుందని, తెలంగాణ రాష్ట్ర అవతరణ తేదీని అందులోనే పొందుపరుస్తామని అన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న 84 వేల మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉందన్నారు. ఇక తెలంగాణలో పదేళ్ల పాటు అడ్మిషన్ల విధానం మారదని, ఇప్పుడు ఉన్నట్లే ఉంటుందని ఆయన వివరించారు. రెండు ప్రాంతాలు నేతలు కలహాలు మాని పరస్పరం సహకరించుకోవాలని జైరాం రమేష్ సూచించారు. రాయలసీమలో నాలుగు జిల్లాలకు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఉంటుందని ఆయన చెప్పారు. -
కమిటీలొద్దు..సమైక్యమే ముద్దు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కమిటీలతో తమకు అవసరం లేదని, తక్షణమే విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కో చైర్మన్, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్ కోరారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధన కోసం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మూడో రోజు ఆదివారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాయని తెలిపారు. ఉద్యమం తీవ్రత ఢిల్లీ దృష్టికి పోతోందని.. దీంతో ఆంటోని కమిటీ వచ్చిందన్నారు. తాజాగా ప్రభుత్వ కమిటీని కేంద్రం ప్రకటించిందని వివరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెలోకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, భావి తరాల అభ్యున్నతికి కోసం ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ క్రిష్టఫర్ దేవకుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు చేపట్టిన నిరవధిక సమ్మెను అన్ని వర్గాలు అభినందిస్తున్నాయన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, సర్దార్ అబ్దుల్‌హమీద్, ఇతర ప్రతినిధులు వెంకటేశ్వర్లు, జానకిరామ్, ఎస్ఏఎం.దాస్, లక్ష్మన్న, కరీమ్, జాకీర్ బాష, గోవిందు, రాజారావు, బాలస్వామి, బాషుమియ్య, విభీషణరావు, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు ఎంవి.క్రిష్ణారెడ్డి, ఎంఎస్ఆర్ వరప్రసాద్, మురళీమోహన్‌రెడ్డి, కమలాకర్, రవికుమార్, రాఘవరెడ్డి, జనార్దన్ రెడ్డి, ఖాజా మోద్దీన్, మజహర్ ఉసేన్, చాంద్‌బాష, కె.శేఖర్, రాంగోపాల్ రెడ్డి, రమేష్ నాయక్, ఎం.శివరామ్ తదితరులు దీక్షల్లో కూర్చున్నారు. వీరికి పలు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి.