సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యనేతలతోపాటు అసంతృప్త నేతలకు కీలక కమిటీల్లో చోటు కల్పిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 14 కమి టీలకు చైర్మన్లు, కన్వీనర్లు, కో–కన్వీనర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నియమించారు.
అసంతృప్తవాదులకు బుజ్జగింపు...
పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు దక్క డం లేదని, ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ సర్కార్ పై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయనాయకత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదంటూ కొంతకాలంగా కొందరు జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ తగిన విధంగా వ్యవహ రించకపోతే, బీఆర్‌ఎస్‌ను ఓడించగలిగే పార్టీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమేనంటూ కూడా వారిలో కొందరు ప్రకటించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితు ల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దానిపై, ఇతర అంశాలపై చర్చకు జాతీయ కార్యవర్గ సభ్యు లు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వ ర్‌రెడ్డి, ఎం.రవీంద్ర నాయక్, జి.విజయరామా రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదిత రులు ఇటీవల కాలంలో పలుమార్లు భేటీ అయ్యా రు. వారిలో కొందరు త్వరలోనే బీజేపీని వీడతారంటూ జోరుగా ప్రచారం జరిగింది.
తాజాగా ప్రధాని మోదీ మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో నిర్వ హించిన బహిరంగ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతోపాటు కేసీఆర్ సర్కార్, బీఆర్ ఎస్ తీరును తీవ్రంగా ఎండగట్టడం వంటి పరిణా మాలతో వారి వైఖరిలో మార్పు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా వివిధ కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికలుండగా ఆందోళనల కమిటీకి చైర్మన్‌గా విజయశాంతిని నియ మించడం గమనార్హం.
అదేవిధంగా వివిధ కమిటీ ల్లో వివేక్ వెంకట స్వామి, రాజ్‌గోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రవీంద్రనాయక్, విజయరామారా వులకు ప్రాతినిధ్యం కల్పించారు. వారితోపాటు ముఖ్యనేతలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, మురళీశర్‌రావు, మర్రి శశిధర్‌రెడ్డి. పొంగులేటి సుధాకరరెడ్డిలకు కూడా అవకాశం కల్పించారు. కాగా, తనతోపాటు ఇతర ముఖ్య నేతలెవరూ బీజేపీని వీడట్లేదని రాజ గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
కమిటీలు ఇలా...
సోషల్ అవుట్‌రీచ్ కమిటీ: చైర్మన్‌గా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, కన్వీనర్‌గా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
పబ్లిక్ మీటింగ్ కమిటీ: చైర్మన్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, కన్వీనర్‌గా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్
ప్రజలను ప్రభావితం చేసే వారికి చేరువయ్యే కమిటీ: చైర్మన్‌గా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కన్వీనర్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డి
మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ: చైర్మన్‌గా జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్, కన్వీనర్‌గా మా జీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.
చార్జిషీట్ కమిటీ: చైర్మన్‌గా పార్టీ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి పి.మురళీధర్‌రావు, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జాయింట్ కన్వీనర్‌గా చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ రామచంద్రుడు
స్క్రీనింగ్ కమిటీ: చైర్మన్‌గా జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, కన్వీనర్‌గా దుగ్యాల ప్రదీప్‌కుమార్
ఆందోళనల కమిటీ: చైర్మన్‌గా విజయశాంతి, కన్వీనర్‌గా డా.జి.మనోహర్‌రెడ్డి
సోషల్ మీడియా కమిటీ: చైర్మన్‌గా ఎంపీ అర్వింద్, కన్వీనర్‌గా పోరెడ్డి కిషోర్‌రెడ్డి
ఎన్నికల కమిషన్ అంశాల కమిటీ: చైర్మన్‌గా మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్
ప్రధాన కార్యాలయ సమన్వయ కమిటీ: చైర్మన్‌గా జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, కన్వీనర్‌గా బంగారు శ్రుతి
మీడియా కమిటీ: చైర్మన్‌గా ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు, జాయింట్ కన్వీనర్‌గా డా.ఎస్. ప్రకాష్‌రెడ్డి
క్యాంపెయిన్ ఇష్యూస్/టాకింగ్ పాయింట్స్ కమిటీ: చైర్మన్‌గా వెదిరె శ్రీరామ్, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ: చైర్మన్‌గా జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, కన్వీనర్‌గా మాజీ మంత్రి జి.విజయరామారావు
ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ: చైర్మన్‌గా జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, కన్వీనర్‌గా ఎంపీ సోయం బాపూరావు, జాయింట్ కన్వీనర్‌గా ఎం. రవీంద్రనాయక్ నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment