లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకత్వం.. త్వరలో జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులు, సహ ఇంచార్జులుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాధ్యతలు అప్పగించింది.
జమ్మూ కశ్మీర్ ఇన్‌చార్జీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమించింది. కిషన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ , కో-ఇన్ చార్జ్‌గా అశ్వని వైష్ణవ్, హర్యానా ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కో ఇన్‌చార్జ్‌గా విప్లవ కుమార్ దేవ్‌లను నియమించిన కేంద్రం జార్ఖండ్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ , కో ఇన్‌చార్జ్‌గా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మలను కేంద్రం ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment