హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో టీటీడీ మినహా మిగిలిన దేవాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. కోటి నుంచి 20 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దేవాలయాలకు పాలక మండళ్ల నియమకానికి నిర్ణయం తీసుకుంది.
5 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దేవాలయాలకు 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే 5 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఆదాయమున్న దేవాలయాలకు 11 మందితో, 20 కోట్ల రూపాయలపైగా ఆదాయమున్న దేవాలయాలకు 15 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
దేవాలయాల పాలక మండళ్ల ఏర్పాటుకు కసరత్తు
Published Sat, Oct 18 2014 9:19 PM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement
Advertisement