
రవాణా శాఖ ఆదాయం ఎంత: కేసీఆర్
ఆరా తీసిన ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రవాణాశాఖ ఆదాయంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ శాఖ ఆదాయం ఎంత ఉండబోతోంది అన్న విషయంపై స్పష్టమైన అంచనా కావాలని సీఎం కేసీఆర్ కోరినట్లు తెలిసింది. దీంతో అధికారులు కొన్ని వివరాలను బుధవారం సీఎంకు అందజేసినట్లు సమాచారం. రూ.2 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు వివరించినట్లు తెలిసింది.