'పునర్విభజన చట్టప్రకారం హైకోర్టును విభజించాలి'
ఢిల్లీ: పునర్విభజన చట్టం వివాదాల అంశానికి సంబంధించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు కనుక్కోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు.. పునర్విభజన చట్ట ప్రకారం హైకోర్టును విభజించాలని తెలిపారు. పునర్విభజన చట్టం వివాదాలకు కేంద్రం తెరదించాలన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు వస్తాయని.. దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
సముద్రానికి వెళ్లే జలాలనే పట్టిసీమకు వినియోగిస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సహాయంతో కష్టాల నుంచి బయటపడ్డామన్నారు. ఈ ఏడాదిలో కూడా రెవెన్యూ లోటు ఉందని.. కేంద్రమే ఆదుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదావస్తే 90 శాతం నిధులు గ్రాంట్ల రూపంలో వస్తాయన్నారు.